News September 30, 2024

ఇదే అత్యంత ఖరీదైన వస్తువు!

image

మనిషి ఇప్పటి వరకూ లెక్కలేనన్ని వస్తువుల్ని తయారుచేశాడు. కానీ వాటన్నింటిలోకెల్లా అత్యంత ఖరీదైన వస్తువు ఏది? గిన్నిస్ బుక్ ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే అత్యంత ఖరీదైన మానవ నిర్మిత వస్తువు. 2011లో నిర్మాణం పూర్తి చేసుకున్న దాని విలువ రూ.12.55 లక్షల కోట్ల పైమాటే. భూకక్ష్యలో వ్యోమగాములు ఉండేందుకు ఇది ఓ ఇల్లులా ఉపకరిస్తోంది. మొత్తం 14 దేశాలు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నాయి.

Similar News

News September 30, 2024

తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

image

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని, ఇందుకోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని BJP సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

News September 30, 2024

జయసూర్య వచ్చాడు.. జయాలు తెచ్చాడు!

image

గత కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీలంక క్రికెట్ టీమ్ ఇప్పుడు వరుస విజయాలు నమోదు చేస్తోంది. ఈ క్రెడిట్ సనత్ జయసూర్యదేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఆయన తాత్కాలిక హెడ్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి ఆ జట్టు INDపై ODI సిరీస్, ENGలో ENGపై టెస్టు మ్యాచ్, తాజాగా NZపై టెస్ట్ సిరీస్ గెలిచింది. దీంతో ఆ దేశ క్రికెట్‌లో కొత్త శకం మొదలైందని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News September 30, 2024

కేంద్రం బెంగాల్‌ను పట్టించుకోవడం లేదు: సీఎం మమత

image

కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు కేంద్రం నుంచి ఎటువంటి చేయూత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉత్తర బెంగాల్ అల్లకల్లోలంగా ఉంది. పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కేంద్రం మాకు ఏమాత్రం సాయం చేయడం లేదు. బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే బెంగాల్ గుర్తొస్తుంది’ అని మండిపడ్డారు.