News January 1, 2025

ఇవాళ ఎక్కువ లాభాలొచ్చే బిజినెస్ ఇదే

image

DEC 31న మందుషాపులపై దండయాత్ర చేసిన యువత నేడు జిమ్ సెంటర్ల వద్ద క్యూ కడుతోంది. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటూ JAN 1 నుంచి జిమ్‌లో చేరేందుకు చాలా మంది మొగ్గుచూపుతుంటారు. దీనికి తగ్గట్లే జిమ్ సెంటర్లు కూడా ఏడాది ఫీజు కట్టేవారికి భారీ డిస్కౌంట్స్ ఇచ్చేస్తుంటాయి. ఎన్నో ఆశలతో జిమ్‌లో చేరిన వారు నాలుగు రోజులకే మానేస్తుంటారు. దీంతో ఇవాళ జిమ్ ఓనర్ల గల్లా పెట్టె నిండిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News January 4, 2025

అల్లు అర్జున్‌కు కోర్టు షరతులు

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు పలు షరతులు విధించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. అటు బన్నీకి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు నాంపల్లి కోర్టులో వాదించారు.

News January 4, 2025

లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 101/5

image

సిడ్నీలో జరుగుతున్న BGT ఐదో టెస్టు రెండో రోజు తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా కీలక వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికి 101/5 స్కోర్ చేసింది. వెబ్‌స్టర్ (28), క్యారీ (4) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం AUS తొలి ఇన్నింగ్స్‌లో 84 రన్స్ వెనుకబడి ఉంది. కొన్‌స్టాస్ 23, ఖవాజా 2, లబుషేన్ 2, స్మిత్ 33, హెడ్ 4 రన్స్ చేశారు.

News January 4, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా విధివిధానాలు ఖరారు?

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా నిబంధనలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ విధివిధానాలను నేడు ఖరారు చేసే అవకాశముంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, సమగ్ర కులగణనపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.