News November 25, 2024

ఈ ఏడాది ఎక్కువగా వెతికిన పదం ఇదే!

image

సరైన మీనింగ్ తెలియని, కొత్త పదం గురించి తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. అలా ‘Manifest’ అనే పదాన్ని 2024లో అత్యధికంగా శోధించారని ‘కేంబ్రిడ్జ్’ డిక్షనరీ ప్రకటించింది. ఈ ఏడాదిలో 1.30 లక్షల పేజీ వీక్షణలతో Manifest అగ్రస్థానంలో నిలిచింది. మ్యానిఫెస్ట్ అంటే విజువలైజేషన్ & అఫర్మేషన్. మరి ఈ ఏడాది మీరు ఎక్కువగా ఏ వర్డ్‌ను సెర్చ్ చేశారో కామెంట్ చేయండి.

Similar News

News December 4, 2025

NGKL: జిల్లాలో తగ్గిన చలి తీవ్రత..!

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలితీవ్రత తగ్గింది. గడిచిన 24 గంటలో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో 18.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చారకొండ మండలం సిర్సనగండ్ల 20.1, పదర మండలం వంకేశ్వర్ 20.7, వెల్దండ మండలం బొల్లంపల్లి 20.9, నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూరులో 21.1, తెలకపల్లిలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 4, 2025

OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

image

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.

News December 4, 2025

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ గురించి తెలుసా?

image

థైరాయిడ్‌ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్‌ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.