News December 17, 2024

అత్యంత విలువైన కార్ బ్రాండ్ ఇదే!

image

కంపెనీస్ మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత విలువైన టాప్-15 కార్ బ్రాండ్లలో ఇండియా నుంచి రెండు కంపెనీలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ $1.23 ట్రిలియన్లతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో టొయోటా, BYD, షావోమీ, ఫెరారీ, బెంజ్, జనరల్ మోటార్స్ ఉన్నాయి. ఇక 11వ స్థానంలో $43.12Bతో మహీంద్రా, 13వ స్థానంలో $41.81Bతో సుజుకీ నిలిచాయి.

Similar News

News January 8, 2026

చలి పంజా.. జి.మాడుగులలో 2.7 డిగ్రీలు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. నిన్న ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 2.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదే. అటు TGలోని ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 7.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. ADB, నిర్మల్, ASFB, మంచిర్యాల, MDK, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

News January 8, 2026

పుష్ప స్టైల్‌లో స్మగ్లింగ్.. డీజిల్ ట్యాంక్‌లో ₹25 లక్షల డ్రగ్స్‌

image

ఇండోర్‌ (MP)లో Pushpa సినిమాను తలపించేలా సాగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒక ట్రక్కు కింద అచ్చం ఫ్యూయల్ ట్యాంకులా కనిపించే ఫేక్ డీజిల్ ట్యాంక్‌ను స్మగ్లర్ తయారు చేయించాడు. పోలీసులు దాన్ని ఓపెన్ చేయగా ₹25 లక్షల విలువైన 87 కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. నిందితుడు బుట్టా సింగ్‌ను అరెస్ట్ చేసి ఈ ఇంటర్‌స్టేట్ డ్రగ్ నెట్‌వర్క్ వెనక ఉన్న గ్యాంగ్‌ కోసం గాలిస్తున్నారు.

News January 8, 2026

ప్రభుత్వ ప్రకటనల్లో నాయకుల ఫొటోలు.. జోక్యానికి హైకోర్టు నిరాకరణ

image

AP: ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రులు, అధికార పార్టీ నాయకుల ఫొటోలను ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినవారిని శిక్షించే పరిధి హైకోర్టుకు లేదని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకే వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. కాగా విజయవాడకు చెందిన రైల్వే ఉద్యోగి కొండలరావు ఈ పిల్‌ను దాఖలు చేశారు.