News December 20, 2024
అత్యధిక వ్యూస్ కలిగిన యూట్యూబ్ ఛానల్ ఇదే!

యూట్యూబ్‌లో అత్యధిక సబ్స్క్రైబర్లను మిస్టర్ బీస్ట్ కలిగి ఉన్న విషయం తెలిసిందే. అయితే, అత్యధిక వ్యూస్ మాత్రం టీసిరీస్ ఛానల్ కలిగి ఉంది. ఇందులోని వీడియోస్‌కు మొత్తం కలిపి 259.4 బిలియన్ వ్యూస్ వచ్చాయి. దీని తర్వాత ‘కోకోమిలన్- నర్సరీ రైమ్స్’కు 184.7 బిలియన్ వ్యూస్, ‘సెట్ ఇండియా’కు 165.8B, ‘SONY SAB’కి 116.2B, కిడ్స్ డయానా షోకి 104.1B, LIKE NASTYAకి 101.6B, ZEE TVకి 91 బిలియన్ వ్యూస్ వచ్చాయి.
Similar News
News November 26, 2025
RRR కేసు.. ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్‌కు సిట్ నోటీసులు

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టడీలో ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించారన్న కేసులో మాజీ సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు గుంటూరు సిట్ బుధవారం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 4న విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టం చేసింది. 2021లో రాజద్రోహం కేసు విచారణ సమయంలో తనను కస్టడీలో హింసించి, హత్యకు కుట్ర పన్నారన్న రఘురామ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
News November 26, 2025
‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్.. స్పందించిన హీరోయిన్

తాను నటించిన ‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై తమిళ నటి ఆండ్రియా జెరేమియా స్పందించారు. సినిమాలో బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డైరెక్టర్ అడిగితే పాత్ర కోసం ఏదైనా చేస్తానని ఆమె చెప్పారు. ఆండ్రియా పిశాచి, సైంధవ్, తడాఖా వంటి సినిమాల్లో నటించారు. పిశాచి-2 విజయ్ సేతుపతి, ఆండ్రియా లీడ్ రోల్లో తెరకెక్కింది. కోర్టు కేసు కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.
News November 26, 2025
ఫ్యాన్సీ క్రేజ్.. 8888 నంబర్‌కు భారీ ధర!

కార్ల ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకోసం కొందరు లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. కానీ హరియాణాలో ఓ వ్యక్తి ఏకంగా HR88B8888 నంబర్ ప్లేట్ కోసం ఏకంగా ₹కోటి పైనే వెచ్చించాడు. ఈ నంబర్ కోసం నిర్వహించిన వేలంలో 45 అప్లికేషన్లు వచ్చాయి. బిడ్డింగ్ ధర ₹50 వేలుగా నిర్ణయించగా రికార్డు స్థాయిలో ₹1.17 కోట్లు పలికింది. దేశంలో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా నిలిచింది.


