News December 1, 2024

రోహిత్ శర్మ కొడుకు పేరు ఇదే

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితిక తమ తనయుడికి అహాన్ శర్మ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని రితిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. డిసెంబర్ నెల వచ్చేసింది అంటూ క్రిస్‌మస్ శాంటా గెటప్‌లో ఉన్న ఓ ఫ్యామిలీ బొమ్మ ఫొటోను ఆమె షేర్ చేశారు. అందులోని బొమ్మలకు రోహిత్, రితిక, సమ్మీ, అహాన్ అని పేర్లు పెట్టారు. నవంబర్ 15న రోహిత్-రితిక దంపతులు తమ కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News October 21, 2025

రాజ్ ఇంట్లో సమంత దీపావళి సెలబ్రేషన్స్

image

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి హీరోయిన్ సమంత దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. పండగ సందర్భంగా సామ్ ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా వీరు లవ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

News October 21, 2025

మీ నిస్వార్థ సేవకు సలామ్!❤️

image

దీపావళికి లక్ష్మీ పూజకు ఏర్పాట్లు చేస్తోన్న ఓ మహిళా డాక్టర్‌కు ‘ఎమర్జెన్సీ’ అని ఫోన్ వచ్చింది. మిగతా డాక్టర్లు సెలవులో ఉండటంతో ఆమె పూజను వదిలి తన బాధ్యతకు ప్రాధాన్యతనిచ్చారు. పిండంలో కదలికలు లేకపోవడంతో ఆందోళనలో ఉన్న ఓ గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను కాపాడారు. తన ఇంట్లో లక్ష్మిని వదిలి వచ్చినా.. మరో ఇంటి లక్ష్మీదేవికి ప్రాణం పోశానంటూ ఆమె ట్వీట్ చేశారు. నిస్వార్థంగా సేవచేసే వైద్యులకు సలామ్!

News October 21, 2025

వంటింటి చిట్కాలు

image

* ఫ్రిడ్జ్‌లో బాగా వాసన వస్తుంటే ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి ఒక మూలన పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది.
* బంగాళదుంప ముక్కలను పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టి, తర్వాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా వస్తాయి.
* దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, గుప్పెడు కందిపప్పు, స్పూను మెంతులు, అటుకులు వేయాలి.
* కందిపప్పు పాడవకుండా ఉండాలంటే ఎండుకొబ్బరి చిప్పను ఆ డబ్బాలో ఉంచాలి.