News September 9, 2024

NTR ‘దేవర’ క్రేజ్ ఇదే!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ మూవీ ప్రీబుకింగ్స్‌లో గత రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తోంది. సినిమా రిలీజ్‌కు ఇంకా 18 రోజులు ఉండగా, ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ‘దేవర’ నార్త్ అమెరికా బుకింగ్స్‌లో $1Mకు చేరువైంది. రేపు విడుదలయ్యే ట్రైలర్ అంచనాలు పెంచితే ఈ క్రేజ్ మరింత పీక్స్‌కు చేరే ఛాన్సుంది. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

Similar News

News November 21, 2025

HYD: జలమండలి పేరిట సైబర్ నేరగాళ్ల కొత్త మోసం

image

జలమండలి అధికారుల పేరుతో సైబర్ మోసగాళ్లు రిటైర్డ్ ఉద్యోగి ప్రభాకర్‌ను నమ్మించి ఫోన్‌లో APK ఫైల్ ఇన్‌స్టాల్ చేయించి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.30 లక్షలు దోచుకున్నారు. కేన్ నంబర్ మార్చాలి, లేదంటే నీటి సరఫరా నిలిపేస్తామని బెదిరించారు. డబ్బు ఇతర ఖాతాలకు వెళ్లినట్లు చిలకలగూడ పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. నల్లా బిల్లు పేరిట కొత్త రకమైన మోసాలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సిట్‌కు అన్నీ వాస్తవాలే చెప్పా: వైవీ సుబ్బారెడ్డి

image

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సిట్ విచారణ ముగిసింది. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. సిట్‌కు అన్నీ వాస్తవాలే చెప్పానని తెలిపారు. దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. 2018 తర్వాతి నుంచి చిన్న అప్పన్న తన దగ్గర పీఏగా పని చేయడం లేదని పేర్కొన్నారు.