News November 22, 2024
దేశంలో టెలికం యూజర్ల సంఖ్య ఇలా!

టెలికం రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. BSNL తీసుకున్న కొన్ని నిర్ణయాలు జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా మారాయి. గత కొన్ని నెలలుగా సంస్థకు భారీగా వినియోగదారులు పెరిగారు. సెప్టెంబర్ 30 వరకు టెలికం మార్కెట్లో ఉన్న కంపెనీల షేర్స్ ఇలా ఉన్నాయి. Jio యూజర్లు 47.7 కోట్లు, Airtel యూజర్లు 28.5 కోట్లు, Vodaphone Idea యూజర్లు 12.26 కోట్లు, BSNL యూజర్లు 3.7 కోట్లు.
Similar News
News December 20, 2025
స్టార్‌బక్స్ CTOగా భారత సంతతి వ్యక్తి ఆనంద్ వరదరాజన్

ప్రపంచ ప్రఖ్యాత కాఫీ స్టార్‌బక్స్ తమ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన ఆనంద్ వరదరాజన్‌ను నియమించింది. ఆయన గతంలో 19 ఏళ్ల పాటు అమెజాన్‌లో పనిచేశారు. అక్కడ గ్లోబల్ గ్రోసరీ బిజినెస్‌కి టెక్నాలజీ అండ్ సప్లైచైన్ హెడ్‌గా పనిచేశారు. ఒరాకిల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. IIT నుంచి అండర్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత పర్డ్యూ, వాషింగ్టన్ యూనివర్సిటీల నుంచి మాస్టర్స్ చేశారు.
News December 20, 2025
మేడిగడ్డ వ్యవహారం.. L&Tపై క్రిమినల్ కేసు!

TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పనులు చేపట్టిన L&T సంస్థపై క్రిమినల్ కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. L&Tపై క్రిమినల్ కేసుకు న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ వైఫల్యానికి L&Tదే బాధ్యత అని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయనుంది.
News December 20, 2025
AIIMS న్యూఢిల్లీలో ఉద్యోగాలు

<


