News November 23, 2024
దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే
దేశంలోని ప్రతీ రాష్ట్రంలో రైల్వే లైన్ ఉంది. సిక్కింలో మాత్రం రైల్వే సౌకర్యం లేదు. అక్కడి ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణం. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మించడం కుదరదు. పైగా ఇక్కడ తరచూ కొండ చరియలు విరిగిపడతాయి. రాష్ట్రంలో ఎన్ని టూరిజం స్పాట్‌లు ఉన్నా రైల్వే సౌకర్యం లేక ఆదరణ తగ్గుతోంది. ఇటీవలే రంగ్‌పో రైల్వే స్టేషన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
Similar News
News November 23, 2024
జానీ మాస్టర్‌కు ఊరట
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన జానీకి అక్టోబర్ 24న హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
News November 23, 2024
విద్యాసంస్థలకు హెచ్చరిక.. అలా చేస్తే రూ.15లక్షల ఫైన్!
AP: రూల్స్ అతిక్రమించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. స్టూడెంట్స్‌కు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వకపోతే, అధిక ఫీజులు వసూలు చేస్తే రూ.15లక్షల ఫైన్ విధించడంతో పాటు గుర్తింపును రద్దు చేసే అధికారం కమిషన్‌కు ఉంటుందని గుర్తుచేసింది. ఏవైనా సమస్యలుంటే 8712627318, 08645 274445 నంబర్లలో ఫిర్యాదు చేయొచ్చని విద్యార్థులకు సూచించింది.
News November 23, 2024
మహారాష్ట్ర మేజిక్ ఫిగర్ ఎంతంటే?
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ 145. మహాయుతి, మహావికాస్ అఘాడీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మహాయుతి కూటమిలో భాగంగా BJP-148, శివసేన షిండే వర్గం-80, అజిత్ పవార్ NCP వర్గం-53 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్-103, శివసేన UBT-89, NCP SP-87 చోట్ల బరిలో నిలిచాయి. ప్రస్తుతం MHలో మహాయుతి అధికారంలో ఉంది.