News November 20, 2024
Key to the City of Georgetown అసలు కథ ఇదే

గయానాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ రాజధాని జార్జ్‌టౌన్ Key to the City అందుకున్నారు. ఇది ఆ దేశ పాలకుల ద్వారా అతిథికి గౌరవసూచకంగా అందించే మధ్యయుగ కాలం నాటి సంప్రదాయం. ఆ దేశ పర్యటనకు విచ్చేసిన ప్రముఖ వ్యక్తుల పట్ల విశ్వాసం, గౌరవం, స్నేహపూర్వకతకు ప్రతీకగా దీన్ని బహూకరిస్తారు. మోదీపై గౌరవసూచకంగా, ఇరు దేశాల బంధాలు మరింత మెరుగుపడేలా ఆ దేశ పాలకులు ఈ తాళాన్ని బహూకరించారు.
Similar News
News December 3, 2025
భారత్ ముక్కలైతేనే బంగ్లాదేశ్‌కు శాంతి: అజ్మీ

బంగ్లా మాజీ ప్రధాని హసీనాను అప్పగించడంపై భారత్-బంగ్లా మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. ఇలాంటి తరుణంలో బంగ్లా ఆర్మీ మాజీ జనరల్, జమాతే ఇస్లామీ మాజీ చీఫ్ గులాం అజామ్ కుమారుడు అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ ముక్కలవ్వకుండా ఉన్నంతకాలం బంగ్లాలో శాంతి నెలకొనదు’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. 1971 లిబరేషన్ వార్‌లో హిందువులు, ప్రో లిబరేషన్ బెంగాలీల ఊచకోతకు ఇతని తండ్రే కారణం.
News December 3, 2025
రాగి పాత్రలు వాడుతున్నారా?

ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది రాగిపాత్రల వాడకం మొదలుపెట్టారు. అయితే వీటిలో కొన్ని ఆహారపదార్థాలు పెట్టేటపుడు జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. రాగిపాత్రలో పెట్టిన పెరుగును తింటే వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి. అలా-గే సిట్రస్ ఫ్రూట్స్‌తో పెట్టిన పచ్చళ్లు, ఆహారాలు రాగితో రసాయన చర్యలు జరుపుతాయి. కేవలం నీటిని, అదీ 8-12 గంటలపాటు నిల్వ ఉంచిన నీటినే తాగాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
చెలరేగిన బ్యాటర్లు.. భారత్ భారీ స్కోర్

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ 358/5 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(14), జైస్వాల్(22) నిరాశపరచగా.. రుతురాజ్(105) వన్డేల్లో తొలి సెంచరీ బాదారు. కోహ్లీ(102) వరుసగా రెండో వన్డేలోనూ శతకం నమోదు చేశారు. రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, వరుసగా రెండో అర్ధసెంచరీ(66*) చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ 2, బర్గర్, ఎంగిడి తలో వికెట్ తీశారు.


