News April 25, 2024
T20WC కోసం పఠాన్ టీమ్ ఇదే.. మీరేమంటారు?

రానున్న T20WC కోసం ఇర్ఫాన్ పఠాన్ తన అంచనాతో భారత జట్టును ఎంపిక చేశారు. IPLలో ఫామ్‌లో అదరగొడుతున్న ప్లేయర్లను దృష్టిలో పెట్టుకుని.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, జైస్వాల్ , కోహ్లీ, సూర్యకుమార్, పంత్, దూబే, హార్దిక్, రింకూ సింగ్, జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, సిరాజ్, బిష్ణోయ్/చాహల్, శుభ్‌మన్ గిల్/సంజూ శాంసన్‌లను ఎంపిక చేశారు. పఠాన్ టీమ్‌పై మీరేమంటారు?
Similar News
News March 23, 2026
మూసీ ప్రక్షాళనపై సలహాలు స్వీకరిస్తాం: సీఎం రేవంత్

TG: మూసీ ప్రక్షాళన అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘గుజరాత్‌లో సబర్మతి ప్రక్షాళనకు కాంగ్రెస్ సహకరించింది. HYDలో మూసీ అభివృద్ధికి రాజకీయ రంగు ఎందుకు? అడ్డుకోవడం తప్పించి ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాం. నాకు చెప్పడానికి ఇబ్బందైతే మంత్రులతో కమిటీ వేస్తా. వాళ్లకైనా మీ అభిప్రాయాలు చెప్పండి’ అని సూచించారు.
News March 23, 2026
సంచలనం.. ఇకపై సిలిండర్‌లో 10 కేజీల గ్యాస్?

గ్యాస్ సరఫరాలో సమస్యలతో రీఫిల్లింగ్ సైజ్‌ను తగ్గించాలని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు యోచిస్తున్నట్లు ToI వెల్లడించింది. 14.2KGల సిలిండర్లలో 10KGల గ్యాస్‌నే(రేటు తగ్గించి) అందించే అవకాశం ఉందని తెలిపింది. ‘చిన్న ఫ్యామిలీకి 14.2KGల సిలిండర్ 35-40 రోజులు వస్తుంది. 10 కేజీలైతే నెలపాటు సరిపోతుంది. దీనివల్ల కొరత రాదు. ఈ సమయంలో కంపెనీలు నిల్వలను పెంచుకునే వీలుంటుంది’ అని ఓ అధికారి చెప్పినట్లు పేర్కొంది.
News March 23, 2026
దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న MLA దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని బీజేపీ MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. దీనిపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని దానంతోపాటు అసెంబ్లీ సెక్రటరీకి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.


