News March 16, 2024
వైఎస్ జగన్ రాజకీయ చరిత్ర ఇదే

వైఎస్ జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్‌లో ప్రారంభించి, 2009 మే నెలలో తొలిసారిగా కడప ఎంపీగా గెలిచారు. అనంతరం 2011 ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారు. 2014 పులివెందుల ఎమ్మెల్యేగా 75,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో, 2019లో 90,110 భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా జగన్ చరిత్ర సృష్టించారు.
Similar News
News March 9, 2026
VRకు కడప జిల్లా కానిస్టేబుల్.!

కడప జిల్లా కలసపాడు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కిషోర్‌ను VRకు పంపినట్లు SI సుహాన్ తెలిపారు. కిషోర్ కలసపాడు PSలో కోర్ట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులపట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో కడప జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో విఆర్‌కు పంపినట్లు కలసపాడు ఎస్సై వివరించారు.
News March 9, 2026
కడప: ‘ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి’

మహిళా సాధికారతలో భాగంగా ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ మహిళలకు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మహిళా సాధికారిత కోసం మొదటి సారిగా 1995-96లో CM చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో 40వేల సంఘాలు ఉన్నాయన్నారు.