News December 20, 2024

ప్రపంచంలోనే నిశ్శబ్ద ప్రదేశం ఇదే!

image

భూమిపై అత్యంత నిశ్శబ్ద ప్రదేశం గురించి మీరెప్పుడైనా విన్నారా? మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్‌లోని(USA) ఓర్ఫీల్డ్ లాబొరేటరీస్‌లో గల అనెకోయిక్ టెస్ట్ ఛాంబర్‌లో ఇది ఉంది. దీనిని నిర్మించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది. ధ్వని తరంగాలు రిఫ్లెక్ట్ అవకుండా కట్టడంతో ఈ గది లోపల ధ్వనిస్థాయి -20.3 డెసిబుల్స్‌ మాత్రమే. దీంతో ఈ రూమ్‌లో ఉన్నవారికి తమ హార్ట్ బీట్, రక్త ప్రసరణ ధ్వని కూడా పెద్దగా వినిపిస్తుంది.

Similar News

News September 17, 2025

అల్లూరి: పవన్ కళ్యాణ్ మంచి మనసు

image

ఏలేశ్వరం మండలంలోని రమణయ్యపేట నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే రహదారి అధ్వాన్నంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోడ్డుపై సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏలేశ్వరం-అడ్డతీగల మధ్య 10.5కి.మీ రోడ్డులో గుంతలు పూడ్చి, మరమ్మతులు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో పవన్ మంచి మనసును స్థానికులు కొనియాడుతున్నారు.

News September 17, 2025

ప్రధాని మోదీకి ప్రముఖుల శుభాకాంక్షలు

image

PM మోదీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల సంక్షేమం, వికసిత్ భారత్ కోసం మీ సంకల్పం మాకు స్ఫూర్తి’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘రాజకీయాలంటే సేవ అని, అధికారం కాదు త్యాగమని నేర్పిన ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని సంజయ్ అన్నారు. PM మోదీకి ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ LoP రాహుల్ గాంధీ, TG CM రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

News September 17, 2025

కోళ్లలో పుల్లోరం వ్యాధి – లక్షణాలు

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.