News March 21, 2024
ధోనీ నిర్ణయంపై CSK యాజమాన్యం రియాక్షన్ ఇదే..

CSK కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడంపై ఆ జట్టు CEO కాశీ విశ్వనాథన్ స్పందించారు. కెప్టెన్ల సమావేశానికి ముందే ఈ విషయం తనకు తెలిసినట్లు చెప్పారు. ధోనీ నిర్ణయాన్ని గౌరవించామన్నారు. మిస్టర్ కూల్ ఏం చేసినా అది జట్టుకు మేలు చేస్తుందన్నారు. కాగా కెప్టెన్ల ఫొటోషూట్‌లో ధోనీ లేకపోవడంతో ఆయన సారథిగా తప్పుకున్న విషయం బయటకు వచ్చింది. ఫొటోషూట్ తర్వాత కాసేపటికే CSK కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించింది.
Similar News
News September 13, 2025
‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.
News September 13, 2025
మోదీ మణిపుర్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు

ఘర్షణలు జరిగిన రెండేళ్ల తర్వాత PM మోదీ మణిపుర్ <<17696611>>పర్యటన<<>>కు వెళ్లడం అక్కడి ప్రజలను అవమానించడమేనని INC మండిపడింది. ‘864 రోజుల ఘర్షణలో 300 మంది చనిపోయారు. 1500 మంది గాయపడ్డారు. 67వేల మంది నిర్వాసితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు PM 46 విదేశీ పర్యటనలు చేశారు కానీ ఒక్కసారి కూడా మణిపుర్‌లో పర్యటించలేదు’ అని ఖర్గే విమర్శించారు. రెండేళ్ల తర్వాత మోదీ మణిపుర్ వెళ్లడం దురదృష్టకరమని ప్రియాంకా గాంధీ అన్నారు.
News September 13, 2025
కుక్కలను చంపి పాపం మూటగట్టుకోవద్దు: మంత్రి

TG: వీధి కుక్కల సమస్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘US లాంటి దేశాల్లో మనుషుల్లాగే కుక్కలకూ విలువ ఇస్తున్నారు. వాటిని చంపాల్సిన అవసరం లేదు. పాపం మూటగట్టుకోవద్దు. దత్తత తీసుకునే కార్యక్రమాలకు సహకారం అందిస్తాం. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్‌పై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలి. కుక్క కాటుకు గురికాకుండా, ఒకవేళ గురైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి’ అని సూచించారు.