News September 4, 2025
దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక: పవన్

AP: GST సంస్కరణలను Dy.CM పవన్ స్వాగతించారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇచ్చిన మాటను PM మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ మార్పులతో పేద, మధ్య తరగతి, రైతులకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా విద్య, జీవిత బీమాపై GST తొలగింపు కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక. నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 5, 2025
ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) ఇవాళ ముంబైలో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సూర్యవంశీ, దృశ్యం, మర్దానీ వంటి చిత్రాల్లో సహాయ పాత్రలతో ఆశిష్ గుర్తింపు పొందారు. హిందీతో పాటు మరాఠీ, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. ఆశిష్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
News September 5, 2025
ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించారు: జగన్

AP: రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని CM చంద్రబాబు భ్రష్టు పట్టించారని YCP చీఫ్ జగన్ విమర్శించారు. ‘‘ఈ 15 నెలల్లో నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన రూ.4,500 కోట్లకు గానూ కేవలం రూ.600 కోట్లే ఇచ్చారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు అందించే ‘ఆరోగ్య ఆసరా’ను సమాధి చేశారు. దీనికి ఇవ్వాల్సిన దాదాపు రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు’’ అని ఆరోపించారు.
News September 5, 2025
ఇలాంటి వారిని అభినందించాల్సిందే❤️

రాత్రి వేళల్లో ఎంతో మంది మహిళలను సురక్షితంగా ఇంటికి చేర్చుతున్న చెన్నైకి చెందిన లేడీ ఆటో డ్రైవర్ రాజీ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె దాదాపు 20 ఏళ్లుగా నగరంలో ఆటో నడుపుతూ వేలాది మంది అభిమానాన్ని పొందారు. మహిళలకు అర్ధరాత్రి ఏ అవసరమొచ్చినా ఆమె ఆటో సిద్ధంగా ఉంటుంది. రాజీ మహిళలకు ఉచితంగా ఆటో నేర్పించడమే కాకుండా పిల్లలు, వృద్ధులు, పేదవారికి ఉచిత ప్రయాణం అందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.