News December 6, 2024

శాంటా క్లాజ్ అసలు ముఖం ఇదే!

image

మైరా నగరానికి చెందిన సెయింట్ నికొలస్ స్ఫూర్తితో శాంటాక్లాజ్ అన్న కాన్సెప్ట్ రూపొందింది. క్రీ.శ 343లో నికొలస్ మరణించారు. సాంకేతికత ద్వారా ఆయన పుర్రెను విశ్లేషించి సైంటిస్టులు తాజాగా నికొలస్ అసలు ముఖాన్ని రూపొందించారు. చక్కటి ప్రవర్తన కలిగిన పిల్లలకు బహుమతులు ఇచ్చేవారని నికొలస్‌కు పేరు. ఆ లక్షణాలతో డచ్ ప్రజలు సింటర్‌క్లాస్ అనే ఊహాజనిత వ్యక్తిని కల్పించారు. ఆ పాత్రే కాలక్రమంలో శాంటాక్లాజ్ అయింది.

Similar News

News February 2, 2026

ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!

image

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం కింద 2026-27 FYలో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.

News February 2, 2026

173 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>NCERT<<>>లో 173 నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Scఅర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 27-50ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in

News February 2, 2026

మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లివే..

image

మహిళలకు వచ్చే క్యాన్సర్‌ వ్యాధుల్లో సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్‌. వీటితోపాటు యూట్రస్‌ క్యాన్సర్‌, అండాశయ (ఓవేరియన్‌) క్యాన్సర్‌ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌, ఓవేరియన్‌ క్యాన్సర్‌ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.