News January 28, 2025
మార్కెట్ లాభాలకు కారణం ఇదే!

చైనా Deepseek AI వల్ల IT స్టాక్స్, ఎయిడ్స్ మందుల సరఫరాకు ఇచ్చే నిధులను నిలిపేస్తామన్న US ప్రకటనతో ఫార్మా రంగాలు నష్టపోయినా దేశీయ స్టాక్ మార్కెట్లు Tue లాభాలతో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెంపు నిర్ణయాలతో రెపో రేటును RBI తగ్గించవచ్చన్న ఉహాగానాలు సెంటిమెంట్ను బలపరిచాయి. దీంతో బ్యాంకు, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో వోలటైల్ మార్కెట్లోనూ సూచీలు లాభపడ్డాయి.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


