News December 3, 2024

మార్కెట్ల‌లో వ‌రుస లాభాల‌కు కార‌ణం ఇదే!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు గ‌త మూడు సెష‌న్ల‌లో వ‌రుస‌గా లాభాల‌ను అర్జించాయి. ఎఫ్ఐఐలు త‌మ డిజిన్వెస్ట్‌మెంట్‌కు బ్రేక్ ఇవ్వ‌డంతో సూచీలు మంగ‌ళ‌వారం దూసుకుపోయాయి. ఎఫ్ఐఐలు రూ.3,664 కోట్ల విలువైన షేర్ల‌ను కొనుగోలు చేయ‌డం సెంటిమెంట్‌ను బ‌ల‌ప‌రిచిన‌ట్టైంది. అదే స‌మ‌యంలో డీఐఐలు రూ.250 కోట్ల విలువైన షేర్ల‌ను అమ్మేశారు. అధిక వెయిటేజీ రంగాల‌కు ల‌భించిన కొనుగోళ్ల మ‌ద్ద‌తు లాభాల‌కు కార‌ణంగా తెలుస్తోంది.

Similar News

News January 24, 2026

వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు!

image

AP: వేసవి సెలవుల్లో(ఏప్రిల్-మే) టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైస్కూల్ ప్లస్‌లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. వేసవి సెలవుల్లో పని చేసిన టీచర్లకు ఆర్జిత సెలవులు ఇస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. రెగ్యులర్ పోస్టుల ఖాళీలు ఏర్పడే వరకు క్లస్టర్ టీచర్లు అక్కడే కొనసాగుతారని అన్నారు.

News January 24, 2026

Grok సేవలకు అంతరాయం

image

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ Grok సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రోక్ యాప్, ట్విటర్‌లోలోనూ అందుబాటులో లేదు. ‘హై డిమాండ్ కారణంగా గ్రోక్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని సరిచేసేందుకు మేము కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని xAI సంస్థ తెలిపింది.

News January 24, 2026

అరుణోదయ స్నానం ఆచరిస్తూ పఠించాల్సిన మంత్రం ఇదే..

image

“యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి’’
తెలిసీ, తెలియక చేసిన పాపాలు, తప్పుల వల్ల వచ్చిన రోగాలు, శోకాలన్నీ ఈ సప్తమి స్నానంతో నశించుగాక! అని దీనర్ధం.