News August 5, 2024

పిడుగుల నియంత్రణకు తాటి చెట్ల పెంపకం.. కారణం ఇదే!

image

పెరుగుతున్న పిడుగుపాటు మరణాలను తగ్గించేందుకు తాటి చెట్లను పెంచాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా అడవుల సరిహద్దుల్లో 19 లక్షల మొక్కలను నాటనుంది. ఇతర చెట్లతో పోలిస్తే ఎక్కువ ఎత్తులో ఉండే తాటి చెట్లకు పిడుగులను గ్రహించే లక్షణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత 11 ఏళ్లలో ఒడిశాలో 3,790 మరణాలు పిడుగుపాటు వల్లే సంభవించాయి.

Similar News

News January 15, 2025

ఈ OTTలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్ట్రీమింగ్!

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది. నవ్వులు పూయించే ఈ సినిమాను చూసేందుకు వృద్ధులు సైతం థియేటర్‌కు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘ZEE5’దక్కించుకుంది. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇంతకీ మీరు ఈ సినిమా చూశారా?

News January 15, 2025

మనోజ్‌పై చర్యలు తీసుకోండి.. మోహన్ బాబు ఫిర్యాదు

image

AP: కుమారుడు మంచు మనోజ్‌పై మోహన్‌బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 200 మందితో మోహన్ బాబు వర్సిటీలోకి <<15163428>>ప్రవేశించేందుకు<<>> మనోజ్ ప్రయత్నించారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లొద్దని పోలీసులు చెప్పినా వినలేదన్నారు. డైరీఫాం గేటు దూకి లోపలకి ప్రవేశించారని పేర్కొన్నారు.

News January 15, 2025

GOOD NEWS: IBPS జాబ్ క్యాలెండర్ విడుదల

image

బ్యాంకు ఉద్యోగార్థులకు IBPS గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. RRBలో ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్, PSBలో ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలకు సంబంధించిన జాబితా ఇందులో ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇతర పూర్తి వివరాల కోసం <>https://www.ibps.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.