News September 25, 2024

రిలయన్స్ పవర్ షేర్ల ర్యాలీకి కారణం ఇదే!

image

నిధుల సేక‌ర‌ణ‌కు బోర్డు ఆమోదించ‌డంతో రిలయన్స్ పవర్ షేరు ధర బుధవారం 52 వారాల గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. 6వ సెషన్‌లో 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. BSEలో స్టాక్ రూ.42.06కి చేరుకుంది. ఒక్కో షేరును రూ.33 చొప్పున ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా రూ.1,525 కోట్ల విలువైన 46.2 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు ఓకే చెప్పింది. దీంతో బోర్డు వ్యాపార విస్త‌ర‌ణ నిర్ణ‌యంతో ఇన్వెస్ట‌ర్లు ఎగ‌బ‌డుతున్నారు.

Similar News

News December 3, 2025

‘గుర్తొ’చ్చింది.. గుర్తుంచుకోండి!

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు మరో వారమే(DEC 11) ఉంది. తాజాగా అభ్యర్థులకు SEC సింబల్స్ కేటాయించింది. దీంతో ‘‘గుర్తు’ గుర్తుంచుకో.. అన్నా గుర్తుంచుకో’ అంటూ ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. పార్టీలను పక్కనపెట్టి అభివృద్ధి చేసేందుకు ‘ఒక్క ఛాన్స్’ అంటూ వేడుకుంటున్నారు. ఇప్పుడు ఓటర్లు తమ వజ్రాయుధాన్ని సద్వినియోగం చేసే టైమొచ్చింది. సమర్థులైన అభ్యర్థికే ఓటు వేయాలని తప్పక గుర్తుంచుకోండి.

News December 3, 2025

‘టీ’ దోమతో జీడి మామిడి తోటల్లో కలిగే నష్టం

image

రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్న తరుణంలో జీడిమామిడి తోటల్లో టీ-దోమ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల పంట ఉత్పత్తిలో సుమారు 30-40% నష్టపోయే ప్రమాదం ఉంది. టీ దోమలు చెట్టు లేత కొమ్మలు, పూత రెమ్మలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. పూత రెమ్మలను ఆశిస్తే పూత మాడి, చెట్టు కాలినట్లు కనిపిస్తుంది. కొత్త కొమ్మలు, రెమ్మలపై ఆశిస్తే చెట్టు అభివృద్ధి క్షీణిస్తుంది. గింజలను ఆశిస్తే గింజలు వడిలి, తొలిదశలోనే రాలిపోతాయి.

News December 3, 2025

ఇది ‘RU-KO’ షో

image

రాయ్‌పూర్ వేదికగా SAతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్(14) నిరాశపరిచారు. కానీ, రుతురాజ్ , కోహ్లీ మాత్రం ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కోవడమే కాకుండా ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. రెగ్యూలర్‌గా మనం రోహిత్-కోహ్లీ(RO-KO) షో చూస్తూ ఉంటాం. ఇవాళ మాత్రం రుతురాజ్-కోహ్లీ(RU-KO) షో చూస్తున్నాం. 28 ఓవర్లకు భారత్ స్కోర్ 193-2.