News September 16, 2024
ఇదే సరైన సమయం.. బయటకు రండి: విశాల్

సినీ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ కోరారు. బయటకొచ్చి మాట్లాడితే అవకాశాలు రావనే ఆలోచనలో ఉండొద్దన్నారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై బాలీవుడ్ నుంచి స్పందన లేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘అది అక్కడ పని చేసే మహిళలపై ఆధారపడి ఉంటుంది. బాధితులు నిజాన్ని బయటపెట్టేందుకు ఇదే సరైన సమయం’ అని అన్నారు.
Similar News
News December 7, 2025
‘బాబ్రీ’ పేరుతో రాజకీయాలు వద్దు: కాంగ్రెస్ MP

టీఎంసీ బహిష్కృత నేత, MLA హుమాయున్ కబీర్‌పై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ డిమాండ్ చేశారు. బాబ్రీ తరహా మసీదు నిర్మాణం పేరుతో దేశంలో విద్వేషపూరిత వాతావరణం సృష్టించడమే టార్గెట్‌గా కామెంట్లు చేశారని మండిపడ్డారు. మసీదు నిర్మించుకోవచ్చని, దాని పేరుతో రాజకీయాలు చేయొద్దన్నారు. ఈ వివాదం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున కబీర్ పోటీ చేశారన్నారు.
News December 7, 2025
వైట్ హెడ్స్‌ని ఇలా వదిలిద్దాం..

శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల్లో వైట్ హెడ్స్ ఒకటి. వీటిని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు..* వేపాకులు, పసుపు పేస్ట్ చేసి దాన్ని వైట్ హెడ్స్‌పై రాసి పావుగంట తర్వాత కడిగేస్తే చాలు. * సెనగపిండి, పెసర పిండి, పాలు, కాస్త నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి 20నిమిషాల పాటు ముఖానికి ఉంచి కడిగేయాలి. * వంటసోడాలో నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని వైట్‌హెడ్స్‌పై రాయాలి. కాసేపటి తర్వాత నీళ్లతో కడిగేయాలి.
News December 7, 2025
6వేల మందితో మూడంచెల భద్రత: సీపీ సుధీర్ బాబు

TG: గ్లోబల్ సమ్మిట్‌కు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ‘6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 2 రోజుల తర్వాత పబ్లిక్కు అనుమతి ఉంటుంది. డెలిగేట్స్‌కు పైలట్ వాహనాలను ఏర్పాటు చేశాం. సమ్మిట్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.


