News July 8, 2025
ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: లోకేశ్

APలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని మంత్రి లోకేశ్ అన్నారు. బెంగళూరులో GCC గ్లోబల్‌లీడర్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా AI, క్వాంటమ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ‘USA సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. 6 నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. టెక్నాలజీలో క్వాంటమ్ వ్యాలీ గేమ్‌ఛేంజర్‌గా నిలవనుంది. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు ఇస్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News July 8, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹550 పెరిగి ₹98,840కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 పెరిగి ₹90,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 8, 2025
US కొత్త చట్టం.. పెరగనున్న వీసా ఫీజులు

US ప్రెసిడెంట్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’తో వీసా ఫీజులు పెరగనున్నాయి. నాన్ ఇమిగ్రెంట్లు తప్పనిసరిగా వీసా జారీ సమయంలో ఇంటిగ్రిటీ ఫీజు కింద $250 చెల్లించాలి. భవిష్యత్ నిబంధనలకు అనుగుణంగా ఇది పెరగొచ్చు. 2026 నుంచి కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఈ మొత్తం ఏటా పెరుగుతూ ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం లేదా రద్దు చేయడానికి వీలుండదు.
News July 8, 2025
‘నవోదయ’లో ప్రవేశాలకు కొన్ని రోజులే గడువు

2026-27 విద్యాసంవత్సరానికి 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో క్లాసులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతి పూర్తయినవారు, ఈ ఏడాది అదే క్లాసు చదువుతున్నవారు అర్హులు. AP, TG సహా పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. cbseitms.rcil.gov.in/nvs వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.