News December 1, 2024
టీచర్ల బదిలీల రోడ్ మ్యాప్ ఇదే

AP: ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు. ఫిబ్రవరి 15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 10-15 వరకు HMలు, 21-25 వరకు SA, మే 1-10 వరకు SGTల బదిలీలు పూర్తిచేస్తారు. అలాగే ఏప్రిల్ 16-20 వరకు HMలు, మే 26-30 వరకు SAల ప్రమోషన్లు చేపడతారు.
Similar News
News November 27, 2025
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.
News November 27, 2025
పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.


