News April 21, 2025

అమరావతిలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే

image

AP: మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతారు. హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం వద్దకు 3.20 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 1.2 కి.మీ పొడవున రోడ్డు షో నిర్వహిస్తారు. 3.35 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. 3.45 గంటలకు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సా.5 గంటలకు ప్రధాని తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరతారు.

Similar News

News April 22, 2025

DSC.. ప్రభుత్వం కీలక ప్రకటన

image

AP: డీఎస్సీ-2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటిపేరుతోనే అప్లికేషన్ నింపాలని తెలిపారు. ఒక అప్లికేషన్లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

News April 22, 2025

48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

image

TG: రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడారు. పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం నీటి పారుదల రంగంపై రూ.81వేల కోట్లు వెచ్చించినా ఏమీ సాధించలేదని దుయ్యబట్టారు.

News April 22, 2025

అద్భుతం.. 10Gbps వేగంతో డౌన్‌లోడ్

image

చైనా మరో అద్భుతం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటగా 10Gbps వేగంతో పనిచేసే 10G బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. బీజింగ్ సమీపంలోని హెబీ ప్రావిన్స్‌లో టెస్టు చేయగా 9834 Mbps గరిష్ఠ వేగంతో ఇంటర్నెట్ పని చేసినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. ఈ వేగంతో రెండు ఫుల్ 4k క్వాలిటీ సినిమాలను ఒక్క సెకన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ రంగాలకు ఇది ఎంతో మేలు చేయనుంది.

error: Content is protected !!