News March 16, 2024
రెండో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఇదే..
దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ 4 నెలలు(OCT 25, 1951 నుంచి FEB 21, 1952 వరకు) సాగింది. ఆ తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం ఈ ఏడాది జరగనున్నాయి. APR 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజులు ప్రక్రియ కొనసాగనుంది. 1962 నుంచి 1989 మధ్య 4-10 రోజుల్లో ఎన్నికలు ముగిశాయి. అత్యల్పంగా 1980లో జనవరి 3 నుంచి 6 వరకు నాలుగు రోజుల్లోనే పూర్తయ్యాయి. 2004లో 21 రోజులు, 2009లో 30, 2014లో 36, 2019లో 39 రోజులు జరిగాయి.
Similar News
News October 30, 2024
క్రాకర్స్ కాల్చేటప్పుడు చేయాల్సినవి.. చేయకూడనివి..
* కాటన్ దుస్తులే ధరించాలి.
* అందుబాటులో బకెట్ నీళ్లు, ఇసుకను ఉంచుకోండి.
* ఫెయిలైన బాణసంచాను మళ్లీ వెలిగించొద్దు.
* ఫ్లవర్పాట్లు, హ్యాండ్ బాంబ్‌లు కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు.
* ఫైర్ క్రాకర్స్ వెలిగించి బహిరంగ ప్రదేశాల్లో విసిరేయకండి.
* అగ్నిప్రమాదం జరిగితే 101,112,100,1070ను సంప్రదించండి.
News October 30, 2024
ధంతేరాస్ సీక్రెట్ ఆపరేషన్: భారత్‌కు లక్ష కిలోల బంగారం
ధంతేరాస్‌కు బంగారం కొని ఇంటికి మహాలక్ష్మీని ఆహ్వానించడం హిందువుల సంప్రదాయం. కేంద్ర ప్రభుత్వమూ ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంది! బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి ఏకంగా లక్ష కిలోల గోల్డ్‌ను గుట్టుచప్పుడు కాకుండా భారత్‌కు తీసుకొచ్చింది. RBI తాజా రిపోర్టుతో ఈ విషయం బయటకొచ్చింది. మే 31న ఇలాగే 100 టన్నుల బంగారాన్ని నాగ్‌పూర్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం BoE, BIS వద్ద 324 టన్నుల భారత బంగారం నిల్వఉంది.
News October 30, 2024
మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీతో పాటు TG సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య జాబితాలో ఉన్నారు. నవంబర్ 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి.