News August 16, 2024

జమ్మూకశ్మీర్ పరిస్థితి ఇదీ!

image

2014లో చివరిసారి JK అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2018లో PDP-BJP ప్ర‌భుత్వం కూలిపోయింది. దీంతో గ‌వ‌ర్న‌ర్ పాల‌న అమ‌లులోకి వ‌చ్చింది. 6 నెలల తరువాత రాష్ట్రప‌తి పాల‌న విధించారు. అనంతరం ఆర్టిక‌ల్‌ 370ని కేంద్రం ర‌ద్దు చేసింది. JK, ల‌ద్దాక్ రెండు UTలుగా ఏర్పాటయ్యాయి. సుప్రీంకోర్టు కూడా ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును స‌మ‌ర్థించి Sep30 లోపు ఎన్నిక‌లు నిర్వహించాలంది. దీంతో EC షెడ్యూల్ ప్రకటించింది.

Similar News

News January 20, 2026

ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

<>కేరళలోని <<>>ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ 81 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల డిప్లొమా, డిగ్రీ(ఇంజినీరింగ్) అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా హోల్డర్లకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ilpgt.com

News January 20, 2026

ఒక్క రోజే రూ.12,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి, బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.12,000 పెరిగి రూ.3,30,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.950 ఎగబాకి రూ.1,35,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 20, 2026

3 నెలల ముందుగానే వచ్చేశాయ్!

image

TG: సాధారణంగా ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చే మామిడిపండ్లు ఈసారి 3 నెలల ముందుగానే వచ్చేశాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ, ఎంజే, గడ్డి అన్నారం తదితర మార్కెట్లలో బంగినపల్లి రకం కేజీ రూ.200 వరకు విక్రయిస్తున్నారు. చప్పగా, పుల్లగా ఉండటంతో మామిడి కొనేందుకు చాలా మంది ఇష్టపడట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. హైబ్రిడ్ సాగు విధానాలు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలతో మామిడి ముందుగానే వస్తోందని పేర్కొన్నారు.