News March 18, 2024

స్లీపర్ క్లాస్‌లో ఇదీ పరిస్థితి!

image

గత కొన్ని నెలలుగా భారతీయ రైల్వేలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జనరల్ బోగీలను తగ్గించడంతో స్లీపర్ బోగీల్లో విపరీతమైన రద్దీ ఉంటోందని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనివల్ల స్లీపర్ బుక్ చేసుకుని, లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం నిలబడేందుకూ ప్లేస్ ఉండట్లేదని, 3ACలోనూ అదే పరిస్థితి ఉంటోందని చెబుతున్నారు. వందేభారత్ లాంటి ప్రీమియర్ రైళ్లతో పాటు సామాన్యుల రైళ్లనూ పట్టించుకోవాలని కోరుతున్నారు.

Similar News

News November 15, 2024

మా రిలీజ్‌లు ఉన్నప్పుడే సెంటిమెంట్ మాటలు: నాగవంశీ

image

తమ సినిమాలు వస్తున్నప్పుడే పోటీ సినిమాలు సెంటిమెంట్ కార్డ్ ప్లే చేస్తుంటాయని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించారు. ‘మా సినిమాలకు పోటీగా విడుదల చేసే సినిమావాళ్లే తమ కష్టాలు, కన్నీళ్లు గురించి చెబుతుంటారు. మేం రిలీజ్ పెట్టుకున్నప్పుడే ఇలాంటివి ఎందుకు జరుగుతాయో మరి! ఇకపై మేము కూడా సింపతీ మాటలు చెప్పాలేమో’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’కు పోటీగా హనుమాన్ విడుదలైన సంగతి తెలిసిందే.

News November 15, 2024

శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త

image

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం SCR 8 స్పెషల్ రైళ్లను ప్రకటించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి-కొల్లం, 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లం, ఈ నెల 24, డిసెంబర్ 1న కొల్లం-మౌలాలి, ఈ నెల 20, 27 తేదీల్లో కొల్లం-మచిలీపట్నం మధ్య ఈ 8 సర్వీసులు తిరుగుతాయని వెల్లడించింది. పైన ఫొటోలో రైలు టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు చూడొచ్చు.

News November 15, 2024

‘కంగువ’ థియేటర్లలో సౌండ్ తగ్గింపు?

image

నిన్న విడుదలైన కంగువ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆడియో చాలా లౌడ్‌గా, ఇబ్బందిగా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రెసూల్ సైతం దీనిపై పెదవి విరిచారు. పెద్ద సినిమాలు సౌండ్ డిజైనింగ్ లౌడ్‌నెస్ యుద్ధంలో చిక్కుకుంటున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ‘కంగువ’ థియేటర్లలో సౌండ్ తగ్గించాలని ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా సూచించినట్లు తెలుస్తోంది.