News February 27, 2025
ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఇదే!

పార్క్ అనగానే పచ్చని చెట్లు, సేదతీరేందుకు కుర్చీలు, వాకింగ్ ట్రాక్‌లు గుర్తొస్తాయి. అయితే, కేవలం 50CMS మాత్రమే ఉన్న అతిచిన్న పార్కు గురించి మీరెప్పుడైనా విన్నారా? జపాన్ షిజుయోకాలోని నాగిజుమి టౌన్లో 0.24 చదరపు మీటర్లలో A3 పేపర్ షీట్లా ఈ ఉద్యానవనం ఉంటుంది. దీనిని 1988లో నిర్మించగా 2024లో సిటీ పార్కుగా మారింది. ఇది ప్రపంచంలోనే అతిచిన్న పార్క్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
Similar News
News February 27, 2025
మహిళల రక్షణలో సమాజానికీ బాధ్యత ఉంది: జస్టిస్ చంద్రచూడ్

పుణేలోని బస్సులో యువతిపై జరిగిన <<15593054>>అత్యాచారంపై<<>> మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. కేవలం చట్టాలతోనే దురాగతాలను నివారించలేమని అభిప్రాయపడ్డారు. ఆ చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఎక్కడికెళ్లినా తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని మహిళల్లో కలిగించాలని తెలిపారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ, పోలీసులతోపాటు సమాజానికీ బాధ్యత ఉందని పేర్కొన్నారు.
News February 27, 2025
Stock Markets: బ్యాంకు షేర్లు అదుర్స్

గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,545 (-2), సెన్సెక్స్ 74,612 (10) వద్ద క్లోజయ్యాయి. బ్యాంకు నిఫ్టీ 135 Pts పెరిగి 48,743 వద్ద స్థిరపడింది. ఫైనాన్స్, బ్యాంకు, మెటల్ షేర్లు ఎగిశాయి. ఆటో, మీడియా, PSU బ్యాంకు, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు ఎరుపెక్కాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ట్విన్స్, హిందాల్కో, సన్‌ఫార్మా టాప్ గెయినర్స్.
News February 27, 2025
వేసవిలో ఎక్కువగా గుడ్లు, మామిడి తింటే వేడిచేస్తుందా?

రోజుకు ఒక కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, వేసవిలో ఇలా చేస్తే వేడి చేస్తుందని కొందరు తినడం మానేస్తారు. అలాంటి వారికోసం వైద్యులు కీలక సూచనలు చేశారు. ‘వేసవిలో గుడ్లు, మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందని చాలామంది భావిస్తారు. శక్తినిచ్చే ఏ ఆహారమైనా ఎక్కువ కేలరీస్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి అది అపోహ మాత్రమే. మనం వాటిని భేషుగ్గా తినొచ్చు’ అని సూచిస్తున్నారు.