News April 25, 2024

‘ముస్లిం కోటా’ స్టోరీ ఇదే – 1/3

image

కాంగ్రెస్ దేశంలో ‘ముస్లిం కోటా’ అమలుకు ప్రయత్నించిందని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముస్లింలకు రిజర్వేషన్ అనే అంశం తొలిసారిగా 1993-94లో నాటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వెలుగు చూసింది. ముస్లింలలోని 14 వర్గాలకు 5% రిజర్వేషన్‌ను కేటాయించనున్నట్లు 1994 ఆగస్టులో GO వచ్చింది. కానీ 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా ఓడిపోవడంతో అది అమలులోకి రాలేదు. <<-se>>#Elections2024<<>>

Similar News

News November 17, 2025

నేడు నక్తం పాటిస్తున్నారా?

image

ఈ పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారానికి చాలా విశిష్టత ఉంది. గత సోమావారాల్లో ఆచరించని విధులను నేడు ఆచరిస్తే అంతకన్నా ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్మకం. శివ భక్తులు ముఖ్యంగా నేడు ‘నక్తం’ దీక్షను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా సకల శుభాలు కలుగుతాయని అంటున్నారు. నక్తం అంటే.. పగలు ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేయడం. ఈ దీక్షతో శివానుగ్రహంతో అఖండ పుణ్యం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం.

News November 17, 2025

నేడు నితీశ్ రాజీనామా.. 20న ప్రమాణం?

image

బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా CM నితీశ్ కుమార్ ఇవాళ రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 20న ఆయన తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మొత్తం 32 మందితో కొత్త క్యాబినెట్‌ కొలువుదీరనుందని, బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని సమాచారం. స్పీకర్‌గా బీజేపీ సభ్యుడినే నియమిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పాయి.

News November 17, 2025

శివ పూజలో తులసిని వాడుతున్నారా?

image

శివుడికి సంబంధించి ఏ పూజలు నిర్వహించినా అందులో మాల, తీర్థం ఏ రూపంలోనూ తులసిని వినియోగించకూడదనే నియమం ఉంది. శివ పురాణం ప్రకారం.. తులసి వృంద అనే పతివ్రతకు ప్రతిరూపం. ఆమె భర్త జలంధరుడిని శివుడు సంహరించాడు. అప్పుడు శివుడి పూజలో తన పవిత్ర రూపమైన తులసిని వాడరని శాపమిచ్చింది. అందుకే శివుడికి బిల్వపత్రాలు ప్రీతిపాత్రమైనవి. గణపతి పూజలోనూ తులసిని ఉపయోగించరు.