News December 12, 2024
తెలుగు సినిమా రేంజ్ ఇదే!

‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తమైందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిన్న ‘పుష్ప-2’ కలెక్షన్లలో రికార్డు సృష్టించడంతో తెలుగు సినిమా రేంజ్ ఇదేనంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 8 రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలుంటే అందులో నాలుగు మనవేనంటున్నారు. త్వరలో రిలీజయ్యే ప్రభాస్, మహేశ్ సినిమాలు కూడా ఈ జాబితాలో చేరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మీ ఫేవరెట్ ఏంటి?
Similar News
News February 5, 2026
శంషాబాద్ కేంద్రంగా 3 బుల్లెట్ రైలు కారిడార్లు: కిషన్ రెడ్డి

HYD హైస్పీడ్ రైల్ హబ్‌గా మారబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘TGలో రైల్వే మౌలిక సదుపాయాలకు బడ్జెట్‌లో ₹5,454Cr కేటాయించాం. శంషాబాద్ కేంద్రంగా 3 బుల్లెట్ రైలు కారిడార్లు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా HYD-BLR, CHE-PUNE జర్నీకి 3hrs కంటే తక్కువ సమయం పట్టనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ₹47,984Cr విలువైన ప్రాజెక్టులు కొనసాగుతుండగా, 100% రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయింది’ అని పేర్కొన్నారు.
News February 5, 2026
ఏపీలోని ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

AP: కాకినాడలోని <
News February 5, 2026
తులసి మొక్కను నాటుతున్నారా?

తులసి మొక్క నాటేందుకు గురు, శుక్రవారాలు శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి తిథి, ఆది, సోమవారాలతో పాటు గ్రహణ సమయంలో నాటకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ మొక్క ఇంటికి ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలో ఉంటే మంచి జరుగుతుందని వాస్తు నిపుణుల సూచన. దక్షిణ, నైరుతి దిశల్లో అస్సలు ఉంచకూడదంటున్నారు. అయితే తులసి మొక్కను ఎవరు నాటాలి, ఎవరు నాటకూడదో అని నియమాలున్నాయి. వాటి పూర్తి వివరాలకై క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


