News March 30, 2024

‘మ్యాడ్’ మూవీ సీక్వెల్ టైటిల్ ఇదే..

image

గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. తాజాగా సీక్వెల్ టైటిల్‌ను దర్శకుడు అనౌన్స్ చేశారు. ‘మ్యాడ్ మ్యాక్స్’ పేరుతో ఈ మూవీని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 12న షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు.

Similar News

News January 31, 2026

భారత్vsన్యూజిలాండ్.. నేడే ఫైనల్ టీ20

image

IND, NZ మధ్య ఐదో టీ20 ఇవాళ తిరువనంతపురంలో జరగనుంది. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో హార్దిక్, హర్షిత్ స్థానాల్లో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ వచ్చే అవకాశముంది. సంజూ శాంసన్ తన హోమ్ గ్రౌండ్‌లో తొలిసారి IND తరఫున ఆడబోతున్నారు. దీంతో ఈ మ్యాచులో అయినా భారీ స్కోర్ చేస్తారేమో చూడాలి. T20 WCకి ముందు ఆడే చివరి మ్యాచ్ ఇదే కావడంతో గెలుపుతో ముగించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.
లైవ్: స్టార్‌స్పోర్ట్స్, హాట్‌స్టార్

News January 31, 2026

శని త్రయోదశి పూజ ఎలా చేయాలి?

image

నవగ్రహ ఆలయంలో శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు పోసి మూటకట్టి దీపారాధన చేయాలి. తమలపాకులో బెల్లం ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే రావి చెట్టుకు 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. పూజ అనంతరం నల్లని వస్త్రాలు, పాదరక్షలు లేదా ఆహారాన్ని దానం చేయాలి. శివార్చన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని పండితులు సూచిస్తున్నారు.

News January 31, 2026

బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే ఢమాల్

image

అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్న బంగారం ధర 11%, వెండి రేటు 32% తగ్గింది. గురువారం ఔన్స్(28.35gms) బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు $5,595(రూ.5.13L)కి చేరగా శుక్రవారం $4,722(రూ.4.32L)కి తగ్గింది. ఔన్స్ సిల్వర్ గురువారం $121.67(రూ.11,155)గా ఉండగా శుక్రవారం $79.30(రూ.7,270)కి పడిపోయింది. USD బలోపేతం, ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌గా కెవిన్ వార్ష్‌ నామినేట్, అమ్మకాలు పెరిగి కొనుగోళ్లు తగ్గడం వంటివి దీనికి కారణాలు.