News March 28, 2024

సూర్య కొత్త సినిమా టైటిల్ ఇదే

image

స్టార్ హీరో సూర్య తన తదుపరి చిత్రంపై అప్‌డేట్ ఇచ్చారు. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో 44వ మూవీ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ‘Love Laughter War (ప్రేమ-నవ్వు-యుద్ధం)’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ నిర్మించనుంది. సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News February 6, 2026

గుడిలో తలమీద శఠగోపం ఎందుకు పెడతారు?

image

ఆలయంలో దర్శనం తర్వాత తలపై శఠగోపం పెడతారు. ఆ సమయంలో మనసులో కోర్కెను కోరాలని పండితులు సూచిస్తున్నారు. పూజారికి కూడా వినిపించనంత మెల్లగా మనసులో తలుచుకోవాలని చెబుతారు. ఎందుకంటే.. ఇది మానవునికి శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు దూరంగా ఉంటామని దేవుని ముందు తలవంచి అంగీకరించడం. ఇలా చేయడం వల్ల మన కోరికలు నెరవేరడమే కాకుండా, మనసులోని దుర్గుణాలు తొలగి ప్రశాంతత లభిస్తుందని నమ్మకం.

News February 6, 2026

సైబర్ బాధితులకు రూ.25వేల వరకు కాంపెన్సేషన్..RBI ప్రపోజల్స్

image

చిన్న మొత్తాల డిజిటల్, సైబర్ ఫ్రాడ్స్, బలవంతంగా లోన్ రికవరీతో మోసపోయిన బాధితులకు పరిహారం చెల్లించే ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్టు RBI ప్రకటించింది. నష్టపోయిన దాంట్లో 85%/రూ.25వేల వరకు నగదు రెండింటిలో ఏది తక్కువైతే అంత మొత్తాన్ని చెల్లించేలా ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేస్తోంది. OTP చెప్పడం ద్వారా నగదు కోల్పోయిన బాధితులు కూడా జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే కాంపెన్సేషన్ పొందే అవకాశాన్ని కల్పించనుంది.

News February 6, 2026

ఎప్‌స్టీన్ బతికే ఉన్నాడా?

image

ప్రపంచాన్ని కుదిపేస్తున్న అమెరికా సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ బతికే ఉన్నాడంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఉన్న బడా బాబులు తప్పించుకునేందుకు అతడు చనిపోయాడనే కుట్రకు తెరతీసి దేశం దాటించారనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటికి ఆధారంగా పేర్కొంటూ కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు అతడిది సూసైడ్ కాదని.. కావాలనే హత్య చేశారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.