News December 3, 2024
‘పుష్ప-3’ సినిమా టైటిల్ ఇదే!

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన ‘పుష్ప’ మూవీ సీక్వెల్ ‘పుష్ప-2’ మరో రెండ్రోజుల్లో విడుదల కానుంది. అయితే, ‘పుష్ప-3’ కూడా ఉండనుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘పుష్ప-2’ టైటిల్ ఎండ్ కార్డులో ‘పుష్ప-3.. ది ర్యాంపేజ్’ అని పోస్టర్ రివీల్ చేస్తారని తెలిపాయి. ఎడిటింగ్ రూమ్లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల ‘పుష్ప-3’ పోస్టర్ ఉండటం గమనార్హం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
Similar News
News December 26, 2025
అదానీ దూకుడు.. మూడేళ్లలో 33 కంపెనీలు!

గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ మూడేళ్లలో 33 కంపెనీలను తన ఖాతాలో వేసుకుంది. 2023 జనవరి నుంచి ఇప్పటిదాకా ₹80 వేల కోట్లతో వాటిని దక్కించుకుంది. హిండెన్బర్గ్ <<9860361>>ఆరోపణల<<>> తర్వాత ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేందుకు ఈ కొనుగోళ్లు చేపట్టింది. ఇందులో అంబుజా, ACC, పెన్నా సిమెంట్, కరైకల్ పోర్టు, విదర్భ ఇండస్ట్రీస్ తదితర సంస్థలు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో పలు రంగాల్లో ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
News December 26, 2025
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 26, 2025
కోల్ ఇండియా లిమిటెడ్లో 125 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

<


