News November 1, 2024
వెంకీ మామ కొత్త మూవీ టైటిల్ ఇదే!

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సినిమా టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ ఖరారు చేస్తూ స్పెషల్ పోస్టర్ పోస్ట్ చేశారు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండనుంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించారు. కాగా వచ్చే ఏడాది జనవరి 10న రామ్ చరణ్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ కూడా విడుదలవనుంది.
Similar News
News February 10, 2026
స్థిరంగా బంగారం, వెండి ధరలు

కొన్నిరోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఊగిసలాడుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,57,910, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,44,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర రూ.3 లక్షలుగా ఉంది.
News February 10, 2026
HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 10, 2026
‘ఫోర్ స్టార్స్’ పుస్తకం మేం అమ్మలేదు: పెంగ్విన్

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం లోక్‌సభలో దుమారం రేపడం తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండానే <<19096489>>బుక్ బయటికి రావడం<<>>తో ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పందించింది. ‘బుక్ రైట్స్ మావే. కానీ డిజిటల్/ప్రింట్ రూపంలో రిలీజ్ చేయలేదు. డిస్ట్రిబ్యూట్, సేల్ చేయలేదు’ అని స్పష్టంచేసింది. పుస్తకాన్ని చట్టవిరుద్ధంగా సర్క్యులేట్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


