News April 7, 2024
ఇదే కాంగ్రెస్ రీతి.. నీతి: కేటీఆర్

TG: కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి అవలంబిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళితే అనర్హులు అయ్యేలా చట్ట సవరణ చేస్తామని చెప్పారు. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించారు. తాజాగా మరో ఎమ్మెల్యేకి కాంగ్రెస్ కండువా కప్పారు. ఇదే కాంగ్రెస్ రీతి.. నీతి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News December 5, 2025
బెల్టు షాపులపై దాడులు.. రూ.35 వేల మద్యం సీజ్

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు మండలాల్లోని బెల్టు షాపులపై టాస్క్ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని సహా 7 మండలాల్లో దాడులు నిర్వహించి, సుమారు రూ.35 వేల విలువ గల దాదాపు 600 లీటర్లు ఐఎంఎఫ్ఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 5, 2025
‘పుష్ప-2’కు ఏడాది.. అల్లుఅర్జున్ స్పెషల్ ట్వీట్

‘పుష్ప2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ తమకు మరింత ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని అద్భుతంగా మార్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కెప్టెన్’ సుకుమార్ సహా చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. ‘పుష్ప’గా ఈ 5ఐదేళ్ల ప్రయాణం తన జీవితంలో మరువలేనిదని కొనియాడారు.
News December 5, 2025
ఏపీలో తొలి సోలార్ వేఫర్ యూనిట్: నారా లోకేశ్

AP: దేశంలోనే తొలి సోలార్ ఇంగోట్ వేఫర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటవుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. అనకాపల్లిలో ReNewCorp రూ.3,990 కోట్ల పెట్టుబడితో 6GW సామర్థ్యంతో ఈ యూనిట్ను స్థాపించనున్నట్లు ‘X’ వేదికగా వెల్లడించారు. CII పార్ట్నర్షిప్ సమ్మిట్లో కుదిరిన MoU ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని పేర్కొన్నారు.


