News November 28, 2024

చంద్రబాబు పాలనలో జరిగిందిదే: జగన్

image

AP: చంద్రబాబు గత పాలనలో దిక్కుమాలిన రేట్లకు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని జగన్ ఆరోపించారు. విండ్ విద్యుత్‌కు సంబంధించి యూనిట్ రూ.4.84, సోలార్‌కు రూ.6.49కు ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో సోలార్ యావరేజ్ రూ.5.90 అయితే, తాము రూ.2.49కి సెకీతో ఒప్పందం చేసుకోవడంపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు పాలనలో PPAల వల్ల రాష్ట్రానికి ఏటా రూ.1500 కోట్ల నష్టం వస్తుందన్నారు.

Similar News

News November 28, 2024

పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు!

image

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసి 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అటు ఈ సారి ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తివేయనుంది. అలాగే రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులపై ప్రణాళికలు రచిస్తోంది.

News November 28, 2024

భార్య గొడవపెట్టుకోవడం క్రూరత్వం కాదు.. విడాకులివ్వలేం: హైకోర్టు

image

దాంపత్యంలో గొడవలు సాధారణమని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. మనోవేదన చెందినా అకారణంగా భార్య పెట్టుకొనే గొడవ క్రూరత్వం కిందకు రాదని పేర్కొంది. దీని ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేయలేమని Dr భగీశ్ కుమార్ VS రింకీ కేసులో వెల్లడించింది. 2015లో ఒత్తిడితో పెళ్లి చేసుకున్నానని, అప్పట్నుంచి ఆమె చేతిలో కష్టాలు, అవమానాలు, బ్లాక్‌మెయిలింగ్ ఎదుర్కొన్నానన్న భర్త ఆమెతో విడిపోవడానికి సరైన సాక్ష్యాలు చూపలేదంది.

News November 28, 2024

చిన్మయ్‌ను విడుదల చేయండి: షేక్ హ‌సీనా

image

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సాధువు చిన్మ‌య్ కృష్ణ‌దాస్ అరెస్టు అక్రమమని, వెంట‌నే ఆయ‌న్ను విడుద‌ల చేయాల‌ని ఆ దేశ Ex PM షేక్ హ‌సీనా డిమాండ్ చేశారు. ఆయన అరెస్టు అనంతరం జరిగిన అల్లర్లలో న్యాయ‌వాది మృతి చెందడాన్ని ఖండించారు. ఆల‌యాలు, మ‌సీదులపై దాడులు జరుగుతున్నా శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు. మత స్వేచ్ఛ, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.