News November 14, 2024
సక్సెస్ అంటే ఇదే!❤️

సక్సెస్ అంటే ఏంటని అడిగేవారికి బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి జర్నీని చూపించాలని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పట్నాలో తాను పనిచేసిన హోటల్కు ఇటీవలే వెళ్లినప్పుడు మేనేజర్ వచ్చి రిసీవ్ చేసుకున్నారని పంకజ్ చెప్పారు. అప్పట్లో వెనుక గేటు నుంచి వెళ్లేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అదే హోటల్కు మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్లానని, GM వచ్చి స్వాగతం పలికారని ఇదే విజయం అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
నేటి నుంచే పార్లమెంట్ వింటర్ సెషన్స్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా, ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం తెలపనున్నారు. తాజా సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు SIRపై ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధం కాగా వాడీవేడిగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
News December 1, 2025
శివుడు ఎలా జన్మించాడో తెలుసా?

సృష్టి కార్యంలో భాగంగా విష్ణువు నుదుటి తేజస్సు నుంచి శివుడు ఆవిర్భవించాడని మనం పురాణాల్లో చదువుకున్నాం. అయితే శివుడు స్వయంభూ అని, ఆయన ఎవరి నుంచి జన్మించలేదని, ఆయనే సర్వానికి మూలమని శివ పురాణం పేర్కొంటుంది. శివుడు ధ్యానంలో రుద్రాక్షమాలను లెక్కిస్తున్నప్పుడు, ఓ రుద్రాక్ష నుంచి విష్ణుమూర్తి జన్మించాడని చెబుతోంది. ఈ భిన్న కథనాలు అంతిమంగా త్రిమూర్తుల ఏకత్వతత్త్వాన్ని చాటిచెబుతున్నాయి.
News December 1, 2025
గణనీయంగా తగ్గిన HIV-AIDS కేసులు

భారత్లో 2010-2024 మధ్య HIV- ఎయిడ్స్ కేసులు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వార్షిక కొత్త కేసుల నమోదులో 48.7% క్షీణత నమోదైనట్లు తెలిపింది. అలాగే ఎయిడ్స్ సంబంధిత మరణాలు 81.4%, తల్లి నుంచి బిడ్డకు సంక్రమణ సైతం 74.6% తగ్గినట్లు వివరించింది. అటు 2020-21లో 4.13కోట్ల ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేయగా 2024-25కు ఆ సంఖ్య 6.62కోట్లకు పెంచినట్లు పేర్కొంది.
– నేడు వరల్డ్ ఎయిడ్స్ డే.


