News November 14, 2024
సక్సెస్ అంటే ఇదే!❤️
సక్సెస్ అంటే ఏంటని అడిగేవారికి బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి జర్నీని చూపించాలని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పట్నాలో తాను పనిచేసిన హోటల్‌కు ఇటీవలే వెళ్లినప్పుడు మేనేజర్ వచ్చి రిసీవ్ చేసుకున్నారని పంకజ్ చెప్పారు. అప్పట్లో వెనుక గేటు నుంచి వెళ్లేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అదే హోటల్‌కు మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్లానని, GM వచ్చి స్వాగతం పలికారని ఇదే విజయం అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 14, 2024
Stock Market: వరుసగా ఆరోసారి నష్టాలు
స్టాక్ మార్కెట్లు గురువారం తేరుకుంటున్నట్టు కనిపించినా ఉదయం 11 తరువాత Sharp Fall రావడంతో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంతో 77,580 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు నష్టంతో 23,532 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా వరుసగా ఆరో సెషన్‌లోనూ మార్కెట్లు నష్టాల్లో నిలిచాయి. అయితే, సెన్సెక్స్‌కు 77,400 వద్ద, నిఫ్టీకి 23,500 పరిధిలో కీలక మద్దతు లభించడంతో సూచీలు Sideways వెళ్లాయి.
News November 14, 2024
జగన్ ఆ ఛాన్స్ కోల్పోయారు: మంత్రి సత్యకుమార్
AP: రఘురామకృష్ణం రాజు ఉపసభాపతిగా ఉంటే రాష్ట్రానికి పట్టిన కీడు తొలగిపోతుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆయన ఆ స్థానంలో ఉంటే అసెంబ్లీకి రావాలన్న కోరిక దుష్ట శక్తుల్లో చచ్చిపోతుందని చెప్పారు. ‘అసెంబ్లీకి వస్తుంటే ఎవరు ఏమడుగుతారోనని స్కూల్‌కి వస్తున్నభావన ఉంది. YCP సభ్యులకు అలా అనిపించటం లేదు. ముందే వారు సభకు మొహం చాటేశారు. RRRను అధ్యక్షా అని పిలిచే అవకాశాన్ని జగన్ కోల్పోయారు’ అని పేర్కొన్నారు.
News November 14, 2024
ట్రంప్ 2.O: మంత్రివర్గం ఇదే..
* వైస్ ప్రెసిడెంట్ – జేడీ వాన్స్
* గవర్నమెంట్ ఎఫిషియన్సీ అడ్వైజర్స్ – మస్క్, వివేక్ రామస్వామి
* డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ – తులసీ గబ్బార్డ్
* సెక్రటరీ ఆఫ్ స్టేట్ – మార్కో రూబియో
* అటార్నీ జనరల్ – మ్యాట్ గేజ్
* డిఫెన్స్ సెక్రటరీ – పేట్ హెసెత్
* నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ – మైక్ వాల్ట్జ్
* వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ – సూసీ వైల్స్