News September 10, 2024
ఏపీలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ స్వరూపం ఇదే!

AP: గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి ఐజీ స్థాయి అధికారిని హెడ్‌గా నియమించి, పోలీస్ స్టేషన్ హోదా కల్పించనుంది. ఈ పీఎస్‌కు SHOగా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించి, దీనికి అనుబంధంగా జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్‌ను నెలకొల్పనుంది. అలాగే 5 నగరాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనుంది.
Similar News
News December 16, 2025
రేపే మూడో విడత ఎన్నికల పోలింగ్

TG: రేపు 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు SEC నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,752 స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28,410 వార్డు మెంబర్ల స్థానాలకు 75,725 మంది బరిలో నిలిచారు.
News December 16, 2025
ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలపై సభాసంఘం

AP: ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై స్పీకర్ ఏడుగురు MLAలతో సభాసంఘాన్ని నియమించారు. ఇందులో N.అమర్నాథ్ రెడ్డి ఛైర్మన్‌గా K.రవికుమార్, D.నరేంద్ర, B.శ్రీనివాస్, Y.వెంకట్రావు, B.రామాంజనేయులు, శ్రావణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ అంశంపై ఫిర్యాదులను అసెంబ్లీ సహాయ కార్యదర్శికి నేరుగా లేదా ‘apl.apcob@gmail.com’కి మెయిల్ పంపవచ్చని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు.
News December 16, 2025
CLAT-2026 ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. <


