News October 1, 2024

పాస్‌పోర్టుల రంగులకు అర్థం ఇదే

image

సాధారణంగా పాస్‌పోర్టు నీలం రంగులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. పౌరులందరికీ ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్టులు ఈ రంగులో ఉంటాయి. ఇది కాక మరో 3 రంగులున్నాయి. ఒకటి ఆరెంజ్ కలర్ కాగా మిగతావి తెలుపు, మెరూన్ రంగులు. పదోక్లాస్ పూర్తి చేయని వారికి ఆరెంజ్, దౌత్యవేత్తలకు మెరూన్, భారత ప్రభుత్వ పని మీద విదేశాలకు వెళ్లే అధికారులకు తెలుపు రంగులో పాస్‌పోర్టుల్ని కేంద్రం జారీ చేస్తుంది.

Similar News

News October 2, 2024

కలల్ని రీప్లే చేసే పరికరం.. కనిపెట్టిన పరిశోధకులు

image

ఒక్కోసారి చాలా మంచి కల వస్తుంటుంది. మెలకువ వచ్చేస్తే అయ్యో చక్కటి కల డిస్టర్బ్ అయిందే అంటూ ఫీల్ అవుతుంటాం. ఇకపై అలా ఫీల్ కానక్కర్లేదు. మన మనసులో నడిచే కలను ఒడిసిపట్టి దాన్ని తిరిగి రీప్లే చేసే పరికరాన్ని బ్రెయిన్ ఇమేజింగ్, AI సాంకేతికతల సాయంతో జపాన్‌ పరిశోధకులు రూపొందించారు. పరిశోధనలో పాల్గొన్నవారు చెప్పిన కలలకు, పరికరం గుర్తించిన సమాచారానికి 60శాతం కచ్చితత్వం వచ్చిందని వారు తెలిపారు.

News October 2, 2024

దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్ మోగించిన ఇజ్రాయెల్

image

ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ మిలిటరీ ప్ర‌క‌టించింది. పౌరులు బాంబు షెల్టర్‌లకు దగ్గరగా ఉండాలని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్‌లు మోగించింది. జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా ఈ సైరన్లు మోగించినట్లు పేర్కొంది. ఫోన్లు, TVల ద్వారా ప్ర‌క‌ట‌నలు జారీ చేసింది.

News October 2, 2024

రైతులకు శుభవార్త

image

తెలంగాణలో పామాయిల్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పామాయిల్ గెలల ధరను రూ.17,043కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో రైతులకు దసరా పండుగ ముందే వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పామాయిల్ రైతులకు అధిక ధరలు అందించి రాష్ట్రంలో సాగు లాభసాటి చేసి, అన్నదాతలను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తుమ్మల వెల్లడించారు.