News August 28, 2024

సంక్షోభంలో సంపద సృష్టించుకోవడమంటే ఇదే

image

ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ అట్టుడికిపోయింది. అప్పటి ప్రధాని హసీనాకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఢాకా రోడ్లపైకి వచ్చి విధ్వంసం చేశారు. ఆ సంక్షోభ సమయాన్ని మహమ్మద్ సుమన్(35) అనే వీధి వ్యాపారి అవకాశంగా మలుచుకున్నాడు. నిరసనకారులకు జాతీయ జెండాలు, హెడ్ బ్యాండ్లు అమ్మి భారీ ఆదాయం పొందాడు. భయం వేయలేదా? అని PTI ప్రశ్నించగా ‘ప్రతి ఒక్కరూ ఎప్పుడోసారి చనిపోవాల్సిందే. భయపడటమెందుకు?’ అని చెప్పి ఫేమస్ అయ్యాడు.

Similar News

News November 21, 2025

కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పేపర్ 2 పరీక్ష ఎప్పుడంటే?

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 552 కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధించి పేపర్ 2 పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 14న డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 12న నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 6,332 మంది రాయగా.. పేపర్ 2కు 3,642మంది అర్హత సాధించారు.

News November 21, 2025

యాషెస్ సిరీస్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

image

యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
☛ AUS XI: ఖవాజా, వెదరాల్డ్, లబుషేన్, స్మిత్(C), హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లియాన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్
☛ ENG XI: డకెట్, క్రాలే, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(C), J స్మిత్, అట్కిన్సన్, కార్స్, ఆర్చర్, వుడ్
☛ LIVE: స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్

News November 21, 2025

iBOMMA రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి ఏమన్నారంటే?

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును ఉచితంగా వాదించి అతన్ని బయటకు తీసుకొస్తానంటూ సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు. విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో ఉంటున్న రవి తండ్రి అప్పారావును ఆయన కలిశారు. కేసును వాదించేందుకు కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా తాను నిరాకరించినట్లు అప్పారావు తెలిపారు. తన ఆరోగ్యం సహకరించనందున కోర్టుల చుట్టూ తిరగలేనని చెప్పానన్నారు.