News December 18, 2024

అల్లు అర్జున్ అందుకే శ్రీతేజ్‌ను పరామర్శించలేదు: అల్లు అరవింద్

image

కేసు కోర్టులో ఉన్నందున తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించలేకపోయారని ఆయన తండ్రి అల్లు అరవింద్ తెలిపారు. అందుకే ఆయన తరఫున బాలుడిని తాను పరామర్శించినట్లు చెప్పారు. కిమ్స్ ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేవతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం మాకు పూర్తి సహకారం అందించింది. తమకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

బాపట్ల: ఇబ్బందులా.. ఈ నెంబర్లకు కాల్ చేయండి

image

బాపట్ల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఏవైనా ఇబ్బందులు కలిగితే ఫోన్ నంబర్ 1967 లేదా 77028 06804లను సంప్రదించాలని సూచించారు. ఈ నెంబర్లను కలెక్టర్ బుధవారం విడుదల చేశారు.

News November 27, 2025

నాయకుల ‘ఏకగ్రీవ’ ప్రకటనలు.. ఓటుకు విలువ లేదా?

image

TG: పంచాయతీ ఎన్నికల వేళ నాయకుల ఆఫర్లు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. తమ పార్టీ వ్యక్తి సర్పంచ్‌గా ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి ₹10L-30L ఇస్తామంటున్నారు. అయితే ప్రజల ఓట్లతో గెలిస్తే నిధులివ్వరా? ఏకగ్రీవ ప్రస్తావన చట్టాల్లో ఉన్నప్పటికీ ఓటుకు విలువ లేదా? ‘పెద్దలు’ ఏకమై ఏకగ్రీవాలు చేసుకుంటే.. తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకునే హక్కు ప్రజలు కోల్పోవడం సమంజసమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీరేమంటారు?

News November 27, 2025

వీళ్లు క్యారెట్ తినకూడదని తెలుసా?

image

మలబద్దకం, డయాబెటిస్, నిద్రలేమి సమస్యతో బాధపడేవారు క్యారెట్లు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దురద, దద్దుర్లు, స్కిన్ ఇరిటేషన్ ఉన్నవాళ్లు తినకపోవడం మంచిది. పాలిచ్చే మహిళలు తింటే పాలు రుచి మారి శిశువులు తాగడానికి ఇబ్బంది పడతారు. ఒత్తిడి, ఆందోళన, పలు కారణాలతో నిద్రలేమి సమస్యతో బాధపడేవారు తినకూడదు. అవి నిద్రకు మరింత అంతరాయం కలిగిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.