News April 24, 2025

గేమ్ ఛేంజర్ అందుకే ఫ్లాప్ అయింది: కార్తీక్ సుబ్బరాజ్

image

ఎన్నో అంచనాలతో తెరకెక్కిన రామ్ చరణ్ ’గేమ్ ఛేంజర్’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అందుకు గల కారణాన్ని తమిళ డైరెక్టర్, ఆ మూవీ కథ రైటర్ కార్తీక్ సుబ్బరాజ్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘ఓ ఐఏఎస్ ఆఫీసర్ కథను శంకర్‌కు చెప్పాను. కానీ తర్వాత స్టోరీని పూర్తిగా వేరేలా మార్చారు. కొత్త రైటర్లు చాలామందిని తీసుకున్నారు. కథ, స్క్రీన్‌ప్లే సమూలంగా కొత్త సినిమాను తలపించాయి’ అని పేర్కొన్నారు.

Similar News

News April 24, 2025

ఉగ్రదాడి: అఖిలపక్ష సమావేశం ప్రారంభం

image

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం భేటీ అయింది. ఇందులో కేంద్రమంత్రులు అమిత్ షా, జైశంకర్, నిర్మల, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రదాడి అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రులు ఆ సమావేశంలో వివరిస్తున్నారు.

News April 24, 2025

శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలో రానున్న 3రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. శుక్రవారం 17 మండలాల్లో(శ్రీకాకుళం 4,విజయనగరం 5, మన్యం 8) తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్నట్లు APSDMA వివరించింది. ఇవాళ నంద్యాల(D) దొర్నిపాడులో 43.8°C అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలోని పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

News April 24, 2025

అఖిలపక్ష భేటీకి అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం

image

పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ భేటీకి AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం అందింది. అమిత్ షా తనకు కాల్ చేసి సమావేశానికి రావాలని ఆహ్వానించినట్లు ఒవైసీ తెలిపారు. ఈ సందర్భంగా అందరి అభిప్రాయాలు వినేందుకు PM ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు. ఇవాళ ఉదయం అఖిల‌పక్ష భేటీకి 5-10 MPలు ఉన్న చిన్న పార్టీలనూ పిలవాలని ఒవైసీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!