News October 3, 2025
ఇందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

ప్రపంచవ్యాప్తంగా డాలర్ వాడకం తగ్గడం, BRICS దేశాలు భారీగా బంగారాన్ని కొనడంతోనే గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ వంటి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు & స్టాక్స్/క్రిప్టో మార్కెట్ల అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అంతేకాక, బంగారం ఉత్పత్తి తగ్గడం.. డాలర్ బలహీనపడటం కూడా దీని విలువను పెంచుతున్నాయి.
Similar News
News October 3, 2025
మద్రాస్ హైకోర్టులో TVK పార్టీకి చుక్కెదురు

కరూర్ (TN) తొక్కిసలాటపై TVK పార్టీకి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కేసును CBIకి అప్పగించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. ప్రజలకు నీళ్లు, ఆహారం కల్పించకుండా సభ ఎలా నిర్వహించారని నిలదీసింది. రోడ్డు మధ్యలో సభకు ఎందుకు అనుమతించారని పోలీసులను ప్రశ్నించింది. బాధితులకు పరిహారం పెంపుపై 2వారాల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
News October 3, 2025
బ్రహ్మ సృష్టిలో ఎన్ని లోకాలో మీకు తెలుసా?

ఇతిహాసాలు, పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుని సృష్టిలో చతుర్దశ(14) భువనాలు కలవు. మానవులమైన మనం నివసించే భూలోకం కేంద్రంగా, దీనికి పైన సత్యలోకం వరకు ఏడు ఊర్ధ్వలోకాలు(స్వర్గ లోకాలు) ఉన్నాయి. అలాగే, భూలోకానికి కింద పాతాళం వరకు ఏడు అధోలోకాలు(నరక లోకాలు) కలవు. ఈ విధంగా సప్త ఊర్ధ్వ లోకాలు, సప్త (7) అధోలోకాలు కలిసి మొత్తం 14 లోకాలున్నాయి. <<-se>>#14Bhuvanaalu<<>>
News October 3, 2025
అర్ధసెంచరీలు చేసిన జురెల్, జడేజా

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమ్ ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 218 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోగా జురెల్(68*), జడేజా(50*) అర్ధసెంచరీలతో ఇన్నింగ్సును చక్కదిద్దారు. ఐదో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 326/4 కాగా 164 రన్స్ ఆధిక్యంలో ఉంది.