News February 21, 2025
కిస్, రొమాంటిక్ సీన్లు అందుకే చేయను: హీరో

అన్ని వయసుల వారు చూసేలా సినిమాలు చేయడమే తన ఉద్దేశమని మలయాళ హీరో ఉన్ని ముకుందన్ తెలిపారు. అందుకే ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు చేయొద్దని తాను రూల్ పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఇంటిమేట్ సీన్లలో నటించమని దర్శకులు, నిర్మాతలు ఒత్తిడి చేసినా తాను ఈ నిర్ణయాన్ని మార్చుకోలేదని చెప్పారు. ఆయన నటించిన ‘మార్కో’ సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News November 8, 2025
APPLY NOW: MPMMCCలో ఉద్యోగాలు

వారణాసిలోని మహాత్మ పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్ <
News November 8, 2025
రబీ శనగ సాగుకు అనువైన రకాలు

రబీలో నవంబర్ 15 లోపు వరకు శనగ పంటను విత్తుకోవచ్చు.
☛ రబీకి అనువైన దేశీ శనగ రకాలు నంద్యాల శనగ-1, జెబి-11, జెఎకెఐ-9218, జెబి-130, ధీర, నంద్యాల గ్రామ్-49, నంద్యాల గ్రామ్- 452, నంద్యాలగ్రామ్-776(N.B.E.G)-776.
☛ కాబులి రకాలు: కెఎకె-2, పూలెజి-95311, లాం శనగ-7 (ఎల్‌బిఇజి-7), నంద్యాల గ్రామ్-119(N.B.E.G-119), నంద్యాల గ్రామ్-810 (N.B.E.G-810)
News November 8, 2025
గర్భిణులు-తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు

మహిళలు ప్రెగ్నెన్సీ ముందు, తర్వాత కొన్నిటీకాలు తీసుకోవాలి. వీటివల్ల తల్లీబిడ్డకు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడే మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్ పాక్స్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. తర్వాత HPV, DPT, హెపటైటిస్ బి, కోవిడ్, రెస్పిరేటరీ సిన్సీపియల్ వైరల్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొందరి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా డాక్టర్లు మరికొన్ని వ్యాక్సిన్లు సూచిస్తారు.


