News April 24, 2025
‘రామాయణ్’లో సీత పాత్ర అందుకే తిరస్కరించా: శ్రీనిధి శెట్టి

నితీశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణ్’ సినిమాలో సీత పాత్రలో నటించమని తనకు ఆఫర్ వచ్చినట్లు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెలిపారు. అయితే ఇందులో యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడని తెలిసి ఆ పాత్ర వద్దనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యశ్‌తో కలిసి ఈ అమ్మడు KGF సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. కాగా ‘రామాయణ్’లో రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు.
Similar News
News April 24, 2025
6 మ్యాచుల్లో గెలుస్తామనుకుంటున్నాం: ఫ్లెమింగ్

ఈ సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలపై CSK కోచ్ ఫ్లెమింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఆరు మ్యాచుల్లోనూ తాము గెలుస్తామని ఆశిస్తున్నామని చెప్పారు. కొందరు నవ్వుకున్నా గత ఏడాది ఆర్సీబీ ఇదే చేసిందన్నారు. రాబోయే మ్యాచుల్లో ఆటగాళ్లు అద్భుతంగా ఆడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ వర్కౌట్ కాకపోతే పేలవ సీజన్ నుంచి నేర్చుకుంటామన్నారు.
News April 24, 2025
టీ20ల్లో సరికొత్త రికార్డు

టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన సమయంలో అత్యధిక సార్లు 50+ రన్స్ చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ(62) సరికొత్త రికార్డు నెలకొల్పారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీ చేయడంతో బాబర్(61)ను అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో గేల్(57), వార్నర్(55), బట్లర్(52), డుప్లెసిస్(52) ఉన్నారు.
News April 24, 2025
యుద్ధానికి రెడీ అవుతున్న భారత్?

పాకిస్థాన్‌పై విరుచుకుపడేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. LoC, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ నిబంధనలు ఉల్లంఘించడంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని (సీజ్ ఫైర్) రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అటు హిందూ, అరేబియా సముద్రాల్లో నేవీ మోహరించినట్లు వార్తలొస్తున్నాయి. INS విక్రాంత్ పాకిస్థాన్ వైపు వెళ్తోందని సమాచారం. ఇక వైమానిక దళం రఫేల్ యుద్ధవిమానాలను పలు ఎయిర్‌బేస్‌లకు తరలించింది.