News July 6, 2024
భారతీయుడు-2కి రెహమాన్‌ను అందుకే తీసుకోలేదు: శంకర్

ఏఆర్.రెహమాన్ బిజీగా ఉండటం వల్లే ఆయనను భారతీయుడు-2కి మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోలేదని డైరెక్టర్ శంకర్ స్పష్టం చేశారు. ‘భారతీయుడు-2 పనులు ప్రారంభించినప్పుడు రెహమాన్ రోబో 2.0 BGMపై వర్క్ చేస్తున్నారు. పాటలు త్వరగా కావాల్సి ఉండడంతో ఒత్తిడి చేయడం ఇష్టం లేక అనిరుధ్‌ను సంప్రదించాను. నాకు అతని మ్యూజిక్ ఇష్టం. అతను చాలా పాపులర్ కూడా. అందుకే తీసుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Similar News
News April 3, 2026
వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న మెడిసిన్ రేట్లు

పశ్చిమాసియా యుద్ధం వల్ల ధరలు పెరిగే జాబితాలో మందులు కూడా చేరుతున్నాయి. ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల సరఫరాలో తీవ్ర అంతరాయంతో వాటి ధరలు 200-300% పెరిగాయి. దీంతో మెడిసిన్ రేట్లు గరిష్ఠంగా 180% పెరుగుతాయని తెలుస్తోంది. ప్రజలకు త్వరలోనే ఈ బ్యాడ్‌న్యూస్ చెప్పేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, బీపీ టాబ్లెట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి.
News April 3, 2026
25 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళ

చైనాకు చెందిన బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారవేత్త, బిలియనీర్ యు వెన్‌హాంగ్(55) తన కంటే 30ఏళ్ల చిన్నవాడైన మోడల్‌ను పెళ్లి చేసుకోవడం SMలో వైరల్ అవుతోంది. తన కంపెనీలో పనిచేసిన లియు యుచెన్‌ను 6వ పెళ్లి చేసుకున్నారు. కట్నంగా అతనికి ₹60కోట్లకు పైగా విలువైన ఆస్తులు, కార్లు ఇచ్చారు. ఆమె 45ఏళ్ల వయసులోనూ 25ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకోగా ఆ రిలేషన్ బ్రేక్ అయింది. కాగా ఆమెకు ఇదివరకే ఇద్దరు కొడుకులున్నారు.
News April 3, 2026
ఒత్తైన జుట్టు కోసం ఉసిరి నూనె

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.


