News April 15, 2024

ప్రతిపక్షాలు అందుకే బలహీనపడ్డాయి: అమర్త్యసేన్

image

ఐక్యత లేకపోవడం వల్లే దేశంలోని విపక్షాలు బలహీనపడి, తమ శక్తిని కోల్పోయాయని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ తెలిపారు. అతిపెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్‌లో అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని చెప్పారు. ముందుగా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేపై అమర్త్యసేన్ విమర్శలు చేశారు. నిరక్షరాస్యత, లింగ అసమానతలు దేశంలోని పేదల పురోగతిని కష్టతరం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Similar News

News October 12, 2024

WOW: కుర్రాడిలా మారిపోయిన ధోనీ!

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ ట్రై చేస్తుంటారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో జులపాల జట్టుతో తన కెరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా కనిపించారు. తాజాగా హెయిర్ కట్ చేయించి మరింత కుర్రాడిలా మారిపోయారు. సీఎస్కే టీమ్ ట్విటర్‌లో ఆ లుక్స్ పంచుకుని ‘ఎక్స్‌ట్రీమ్ కూల్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 43 ఏళ్ల ధోనీ ఆ పిక్స్‌లో నవ యువకుడిలా కనిపిస్తుండటం విశేషం.

News October 12, 2024

ICICI క్రెడిట్ కార్డులో మార్పులు.. NOV 15 నుంచి అమలు

image

☞ యుటిలిటీ, ఇన్సూరెన్స్ చెల్లింపులపై ప్రీమియం కార్డు హోల్డర్లకు ₹80వేలు, సాధారణ కార్డు హోల్డర్లకు ₹40వేల వరకే రివార్డులు అందుతాయి
☞ గ్రాసరీ, డిపార్ట్‌మెంట్ స్టోర్లలో ₹40వేల వరకే రివార్డులు
☞ పెట్రోల్ బంకుల్లో ₹50వేల లావాదేవీ వరకే సర్‌ఛార్జ్ రద్దు
☞ యాడ్ ఆన్ కార్డుపై ఏటా ₹199 ఫీజు
☞ క్రెడిట్ కార్డుతో స్కూళ్లు, కాలేజీల్లో చేసే చెల్లింపులపై ఫీజు ఉండదు
☞ థర్డ్ పార్టీ యాప్స్‌తో చేసే చెల్లింపుపై 1% ఫీజు

News October 12, 2024

బాలయ్య-బోయపాటి కాంబోలో ‘BB4’

image

నందమూరి బాలక‌ృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ కాంబోలో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాణంలో 4వ సినిమా మొదలుకానుంది. విజయ దశమి సందర్భంగా సంస్థ ఈ రోజు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 16న ‘BB4’ ముహూర్తం షాట్ చిత్రీకరించనున్నట్లు అందులో పేర్కొంది.