News September 13, 2025

‘రాజాసాబ్’ రిలీజ్‌ను అందుకే వాయిదా వేశాం: నిర్మాత

image

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ 80% పూర్తయినట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. నవంబర్ నెలాఖరు నాటికి సినిమా మొత్తం రెడీ అవుతుందన్నారు. సంక్రాంతి సీజన్ కోసమే డిసెంబర్ 5 నుంచి జనవరి 9వ తేదీకి రిలీజ్‌ను వాయిదా వేశామన్నారు. విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ నిన్న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో VFX వర్క్‌పై ప్రశంసలొస్తున్నాయి.

Similar News

News February 14, 2026

NCPల విలీనం జరగదు: సంజయ్ రౌత్

image

మహారాష్ట్రలో దివంగత అజిత్ పవార్ NCP, శరద్ పవార్ NCPల <<19010034>>విలీనం<<>> లేనట్లేనని శివసేన(UBT) MP సంజయ్ రౌత్ వెల్లడించారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని పవార్ తనతో చెప్పారన్నారు. దీనిపై మహా వికాస్ అఘాడీలోని 3 పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. ఆయన 60 ఏళ్లుగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. కాగా ఛాతీ నొప్పితో ఇటీవల ఆస్పత్రిలో చేరిన పవార్ ఇవాళ డిశ్ఛార్జ్ అయ్యారు.

News February 14, 2026

పడమర దిశలో ఇల్లు ఉండకూడదా?

image

పశ్చిమాన గృహ నిర్మాణం మంచిది కాదని చాలామంది అభిప్రాయం. కానీ ఆ అభిప్రాయం అపోహ మాత్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. అవగాహన లోపంతో ప్రసారమయ్యే అవాస్తవాలను నమ్మకూడదు అంటున్నారు. ‘పడమర దిశకు వరుణుడు అధిపతి. వరుణుడు చల్లగా చూస్తే పాడిపంటలకు లోటుండదు. ఆహ్లాదం, ఆనందం కలిగించే ఆ దేవుడి దిశలో ఇల్లు కట్టుకుంటే ధనరాసులతో కళకళలాడే అవకాశాలు పెరుగుతాయి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 14, 2026

మార్చి నుంచి చకచకా ‘వాహన్’ సేవలు

image

TG: వాహన యజమానులకు అందించే సేవలు మెరుగుపర్చేలా ప్రభుత్వం మార్చిలో ‘వాహన్‘ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రిజిస్ట్రేషన్, లైసెన్స్ పునరుద్ధరణ, ఫీజుల చెల్లింపు, చిరునామాల మార్పు వంటి ఆన్‌లైన్ సేవలన్నీ ఈ పోర్టల్ ద్వారా అందుతాయి. కేంద్ర ప్రభుత్వ ‘సారథి’ పోర్టల్‌లోని సర్వీసులు దీనిలోనూ ఉంటాయి. ప్రస్తుతం SEC, HYD RTOలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనున్నారు.