News January 30, 2025
దావోస్ పర్యటనకు అందుకే వెళ్లాం: మంత్రి శ్రీధర్

TG: దావోస్ పర్యటనపై రాజకీయ విమర్శలు సహజమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రిలయన్స్ కంపెనీ ముంబైలోనే ఉన్నా MH ప్రభుత్వం కూడా దావోస్కు వచ్చి వారితో ఒప్పందం చేసుకుందన్నారు. కరీంనగర్ లాంటి చిన్న నగరాల్లోనూ ఐటీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామని వివరించారు. పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరగాలనే దావోస్ వెళ్లామని మంత్రి చెప్పారు. అటు ఒకట్రెండు రోజుల్లో తమ పార్టీ MLC అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు.
Similar News
News December 1, 2025
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.
News December 1, 2025
దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.
News December 1, 2025
ఇంట్లో గణపతి విగ్రహం ఉండవచ్చా?

గృహంలో వినాయకుడి ప్రతిమను నిరభ్యంతరంగా ప్రతిష్ఠించవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇష్ట దైవాలు, కుల దేవతల విగ్రహాలతో పాటు గణపతి విగ్రహాన్ని కూడా పూజా మందిరంలో పెట్టవచ్చు అని చెబుతున్నారు. అయితే, నవ గ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు లేదా చిత్ర పటాలు పూజా గదిలో లేకుండా చూసుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. వాస్తు ప్రకారం.. గణపతి విగ్రహం ఉంటే ఎలాంటి దోషం ఉండదంటున్నారు.<<-se>>#Vasthu<<>>


